Neeraj Chopra: సవాలుతో కూడుకున్న పోటీ ఎదురైంది.. ప‌త‌కం సాధించినందుకు గ‌ర్వంగా ఉంది: నీర‌జ్ చోప్రా

జావెలిన్​ త్రో ఫైనల్లో సవాలుతో కూడుకున్న పోటీ ఎదురైందని, అయినా ఆత్మ విశ్వాసంతో ఆడాన‌ని నీరజ్ చోప్రా తెలిపాడు.  ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో భారత స్టార్​ అథ్లెట్​ నీరజ్​ చోప్రా జావెలిన్​ త్రో ఫైనల్లో ద్వితీయ‌ స్థానంలో నిలిచి రజత ప‌త‌కం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. ఇక్క‌డి వాతావ‌ర‌ణ ప‌రిస్థితి అంత‌గా అనుకూలంగా లేదని, గాలుల తీవ్ర‌త అధికంగా ఉంద‌ని చెప్పాడు

Neeraj Chopra: సవాలుతో కూడుకున్న పోటీ ఎదురైంది.. ప‌త‌కం సాధించినందుకు గ‌ర్వంగా ఉంది: నీర‌జ్ చోప్రా

Neeraj Chopra

Neeraj Chopra: జావెలిన్​ త్రో ఫైనల్లో సవాలుతో కూడుకున్న పోటీ ఎదురైందని, అయినా ఆత్మ విశ్వాసంతో ఆడాన‌ని నీరజ్ చోప్రా తెలిపాడు.  ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో భారత స్టార్​ అథ్లెట్​ నీరజ్​ చోప్రా జావెలిన్​ త్రో ఫైనల్లో ద్వితీయ‌ స్థానంలో నిలిచి రజత ప‌త‌కం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. ఇక్క‌డి వాతావ‌ర‌ణ ప‌రిస్థితి అంత‌గా అనుకూలంగా లేదని, గాలుల తీవ్ర‌త అధికంగా ఉంద‌ని చెప్పాడు.

మూడో త్రో త‌ర్వాత కూడా పూర్తి విశ్వాతంతో ఉన్నానని నీరజ్ చోప్రా అన్నాడు. నాలుగో త్రోలో పుంజుకుని ర‌జ‌తం సాధించాన‌ని తెలిపాడు. ఈ పోటీల్లో చాలా నేర్చుకున్నాన‌ని, భ‌విష్య‌త్తులో స్వ‌ర్ణ ప‌త‌కం కోసం కృషి చేస్తానని చెప్పాడు. భార‌త్ త‌ర‌ఫున ప‌త‌కం సాధించ‌డం గ‌ర్వంగా ఉందని తెలిపాడు. ఈ విజ‌యం ప‌ట్ల సంతృప్తితో ఉన్నాన‌ని పేర్కొన్నాడు. ఈ పోటీల్లో పాల్గొన్న‌వారు అంద‌రూ బాగా రాణించార‌ని, దీంతో పోటీ తీవ్రంగా ఉంద‌ని చెప్పాడు.

ఒలింపిక్ ప‌త‌క విజేత అనే ఒత్తిడికి గురి కాలేదని తెలిపాడు. ప్ర‌తి సారి బంగారు పత‌కం సాధించ‌డం అనేది కుద‌ర‌ద‌ని చెప్పాడు. కాగా, నీర‌జ్ చోప్రాకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. క్రీడల్లో మ‌న దేశానికి నీర‌జ్ సాధించిన‌ ఈ పతకం ఎంతో ప్రత్యేకమైందని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ట్వీట్ చేశారు. భ‌విష్య‌త్తులోనే మంచి ప్రదర్శన క‌న‌బ‌ర్చాల‌ని ఆయ‌న అన్నారు. నీరజ్‌కు ప‌త‌కం ద‌క్క‌డంతో ఆయ‌న గ్రామం హర్యానాలోని పానీపత్​లో ప్ర‌జ‌లు సంబరాలు చేసుకున్నారు.

Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​ షిప్స్​లో స‌త్తా చాటిన నీరజ్​ చోప్రా