Uttar Pradesh: తుపాకీతో గాల్లోకి కాల్పులు జ‌రిపిన‌ పెళ్లికొడుకు.. ఒక‌రి మృతి.. వీడియో

పెళ్లి వేడుక అనంత‌రం నిర్వ‌హించిన బ‌రాత్‌లో బంధుమిత్రులు అంద‌రూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ గ‌డుపుతోన్న స‌మ‌యంలో పెళ్లి కొడుకు తుపాకీతో గాల్లోకి కాల్పులు జ‌రిపాడు.

Uttar Pradesh: తుపాకీతో గాల్లోకి కాల్పులు జ‌రిపిన‌ పెళ్లికొడుకు.. ఒక‌రి మృతి.. వీడియో

Firing

Uttar Pradesh: పెళ్లి వేడుక అనంత‌రం నిర్వ‌హించిన బ‌రాత్‌లో బంధుమిత్రులు అంద‌రూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ గ‌డుపుతోన్న స‌మ‌యంలో పెళ్లి కొడుకు తుపాకీతో గాల్లోకి కాల్పులు జ‌రిపాడు. అనంత‌రం ఆ తుపాకీని జేబులో పెట్టుకుంటోన్న స‌మ‌యంలో అది మిస్‌ఫైర్ అయి ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి ఓ కెమెరాలో రికార్డ‌య్యాయి.

Presidential Election: ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారు?: విజయసాయిరెడ్డి

సోన్‌భ‌ద్ర జిల్లాలోని బ్ర‌హ్మ‌న‌గ‌ర్‌లో మ‌నీశ్ మ‌ధేషియా అనే యువ‌కుడి పెళ్లి జ‌రిగింది. బ‌రాత్ స‌మ‌యంలో మ‌నీశ్‌ తుపాకీతో గాల్లోకి కాల్పులు జ‌రిపిన అనంత‌రం ఓ బుల్లెట్ అత‌డి స్నేహితుడు, ఆర్మీ జ‌వాను బాబులాల్ యాద‌వ్‌కు త‌గిలింది. ఆ తుపాకీ కూడా బాబులాల్ యాద‌వ్‌దే. అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించార‌ని, చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడ‌ని పోలీసులు తెలిపారు.

Maharashtra: 12 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని శివ‌సేన పిటిష‌న్

మృతుడి కుటుంబం స‌భ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసుకుని, పెళ్లి కొడుకుని అరెస్టు చేశారు. అత‌డు వాడిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వేడుక‌ల్లో తుపాకుల‌తో గాల్లోకి కాల్పులు జ‌ర‌ప‌డం నేర‌పూరిత చ‌ర్య‌. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు అత్యుత్సాహంతో ఇటువంటి ప‌నుల‌కు పాల్ప‌డుతూ ప్ర‌మాదాలు కొనితెచ్చుకుంటున్నారు.