RRR : తారక్ బర్త్‌డే ట్రీట్.. కొత్త రిలీజ్ డేట్‌తో పోస్టర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. ఈ చిత్రంతో తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి చూపించబోతున్నారు దర్శకధీరుడు రాజమౌళి..

RRR : తారక్ బర్త్‌డే ట్రీట్.. కొత్త రిలీజ్ డేట్‌తో పోస్టర్..!

Rrr

RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. ఈ చిత్రంతో తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి చూపించబోతున్నారు దర్శకధీరుడు రాజమౌళి.

RRR

ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ఇటీవల వరకు స్పీడ్‌గా జరిగింది. విడుదల తేదీ ప్రకటించినప్పటి నుండి RRR టీమ్ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంది.. అనుకున్న తేదీకి రావడం పక్కా అనుకుంటున్న టైంలో సెకండ్ వేవ్ కారణంగా షూటింగులకు ప్యాకప్ చెప్పేశారు. థియేటర్లు కూడా మూతపడ్డాయి. దీంతో ఎప్పుడు పరిస్థితి అదుపులోకి వస్తుందో, అప్పుడే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేద్దామని మేకర్స్ వెయిట్ చేస్తున్నారు.

RRR

ఇదిలా ఉంటే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ టీం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కోసం ట్రీట్ రెడీ చెయ్యబోతోందని సమాచారం. మే 20న తారక్ బర్త్‌డే కాబట్టి ఆరోజు న్యూ రిలీజ్ డేట్‌తో కూడిన యంగ్ టైగర్ పోస్టర్ ఒకటి వదలాలని ప్లాన్ చేస్తున్నారు. 2022 జనవరి లేదా వేసవిలో విడుదల చేసే అవకాశముందని టాలీవుడ్ టాక్..