ఒకే ఒక్క క్వార్టర్ దేవుడా : మందుబాబుల వేడుకోలు

  • Published By: madhu ,Published On : May 4, 2020 / 09:11 AM IST
ఒకే ఒక్క క్వార్టర్ దేవుడా : మందుబాబుల వేడుకోలు

దేవుడా..ఒకే ఒక్క క్వార్టర్ వచ్చే విధంగా చూడు.. తన వంతు వచ్చే వరకు స్టాక్ ఉండాలి దేవుడా.. అంటూ మందుబాబులు..క్యూ లైన్ లో వేచి చూస్తూ దేవుడిని ప్రార్థించుకుంటున్నారు. ఎందుకంటే..దాదాపు 40 రోజుల తర్వాత వైన్ షాపులు తెరవడమే కారణం. దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా భారతదేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది.

ఫలితంగా..మద్యం షాపులు, బార్లు తాళాలు పడ్డాయి. ఈ క్రమంలో లాక్ డౌన్ ను పలుమార్లు పొడిగిస్తూ తీస కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మందుబాబులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఎట్టకేలకు..2020, మే 04వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరుచుకోవచ్చని (గ్రీన్, ఆరేంజ్)..కొన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. దీంతో మందుబాబుల ఆనందానికి అవధులు లేవు. 

సోమవారం ఉదయం నుంచే వైన్స్ షాపుల ఎదుట క్యూలు కట్టారు. లైన్ లకు సంబంధించి..దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చాంతాండత క్యూలో నిలబడడం కనిపించింది. కిలోమీటర్ల మేర జనాలు నిలబడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో అనుకున్న టైంకు తెరవగానే..మందుబాబుల్లో ఫుల్ టెన్షన్ పడ్డారు. తమ వరకు వచ్చే వరకు మందు దొరుకుతుందా ? లేదా ? ఎవరికి వారే మథనపడ్డారు. దేవుడా..ప్లీజ్ ఒక్క క్వార్టర్ లభించే విధంగా చూడు..అంటూ ప్రార్థించుకున్నారు. 

తమకు పండుగ రోజు అంటూ కొంతమంది మందుబాబులు వెల్లడిస్తున్నారు. పండుగ రోజు ఎంత సంతోషంగా ఉంటారో..అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉండడం కనిపించింది. కొంతమంది గుర్తు పట్టకుండా ఉండేందుకు హెల్మెట్, పెద్ద పెద్ద టవల్స్, మాస్క్ లు ధరించి క్యూలో నిలబడ్డారు. 

ప్రభుత్వం షరతులు : మద్యాన్ని కొనుగోలు చేయడానికి వచ్చే వారు..విక్రయించే వారు తప్పకుండా నిబంధనలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ముఖానికి కచ్చితంగా మాస్క్ ఉండాలి. క్యూలో నిలబడే వారు…ఒక్కొక్కరు ఆరు అడుగుల దూరం నిలబడాలి. షాపుల ఎదుట తొలుత ఐదుగురు మాత్రమే ఉండాలి.

కానీ ఈ నిబంధనలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అమలు కావడం లేదని తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో ఉన్న క్యూలు చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారంట. షాపుల ఎదుట కట్టెలతో కొంతమంది ఏర్పాటు చేయగా..కొంతమంది..ముగ్గు పిండి, వైట్ పెయింట్స్ తో రౌండ్స్ బ్లాక్స్ వేశారు. తమకు మందు దొరకుతుందా ? లేదా ? అనే టెన్షన్ లో ఉండిపోయారు మందుబాబులు.