Swimming : ఏడాది వయస్సున్న బాలుడికి స్విమ్మింగ్ లో తర్ఫీదు…వైరల్ గా మారిన వీడియో

ఈక్రమంలో ఓ తల్లి తానే స్వయంగా నెలల బాలుడిని స్వీమ్మింగ్ ఫూల్ లో తన చేతులతో పట్టుకుని అతనికి స్విమ్మింగ్ నేర్పిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారాయి.

 Swimming : ఏడాది వయస్సున్న బాలుడికి స్విమ్మింగ్ లో తర్ఫీదు…వైరల్ గా మారిన వీడియో

Swimming

Swimming : చదవులతోపాటు, తమ పిల్లలు క్రీడల్లో సైతం రాణించాలని చాలా మంది తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. చదువుకునే వయస్సులో పిల్లలకు క్రీడలు కూడా చాలా ముఖ్యమే. అయితే పుట్టగానే తన కొడుకును భవిష్యత్తులో పెద్ద స్విమ్మర్ గా తీర్చి దిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓ తల్లి, ఏకంగా నెలల బాలుడికి స్విమ్మింగ్ లో శిక్షణ ఇస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈవీడియో అందరిని ఆశ్ఛర్యంలో ముంచెత్తుతుంది.

మారుతున్న టెక్నాలజీ యుగంలో క్రీడలపై రానురాను ఆసక్తి తగ్గిపోతుంది. చాలా మంది పిల్లలకు చదువులకే సమయం సరిపోవటం లేదు. క్రీడల గురించి ఆసక్తి వారిలో సన్నగిల్లుతుంది. మరోవైపు చాలా మంది తల్లిదండ్రులు తమపిల్లలకు క్రీడలకన్నా చదువులే ముఖ్యమన్న ధోరణితో ఉన్నారు. ఈక్రమంలో ఓ తల్లి తానే స్వయంగా నెలల బాలుడిని స్వీమ్మింగ్ ఫూల్ లో తన చేతులతో పట్టుకుని అతనికి స్విమ్మింగ్ నేర్పిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారాయి. పెరిగి పెద్దైన వెంటనే తన కొడుకును స్విమ్మింగ్ లో ఛాంపియన్ గా తీర్చిదిద్దాలన్న తపన తల్లి కళ్ళల్లో స్ఫష్టంగా కనిపిస్తుందని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియోను ప్రస్తుతం 10లక్షల మందికి పైగా చూశారు. బాలుడిని నీటిలో ముంచుతూ, అతనికి స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్న దృశ్యాలు చూస్తున్న నెటిజన్లు నివ్వెరపోతున్నారు. తల్లి తనకొడుకును చిన్న వయస్సులోనే ఇలా స్విమ్మింగ్ పేరుతో ఇబ్బందులకు గురిచేయటం సరైనది కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.