OnePlus 10T First Sale : వన్‌ప్లస్ 10T ఫస్ట్ సేల్.. ఈ స్మార్ట్ ఫోన్‌పై భారీ డీల్స్.. త్వరపడండి!

OnePlus 10T First sale in India today : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ OnePlus 10T ఫస్ట్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో ఆగస్టు 3 నుంచే వన్‌ప్లస్ 10T సేల్ అందుబాటులోకి వచ్చింది.

OnePlus 10T First Sale : వన్‌ప్లస్ 10T ఫస్ట్ సేల్.. ఈ స్మార్ట్ ఫోన్‌పై భారీ డీల్స్.. త్వరపడండి!

OnePlus 10T First sale in India today Check out price, specifications and deals on smartphone

OnePlus 10T First Sale : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ OnePlus 10T ఫస్ట్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో ఆగస్టు 3 నుంచే వన్‌ప్లస్ 10T సేల్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లాగ్‌షిప్ డివైజ్ అద్భుతమైన డిజైన్, పవర్‌ఫుల్ ఇంటీరియర్‌లతో వచ్చింది. ఇందులో Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్, 16 GB LPDDR5 RAM, 150W SUPERVOOC టెక్నాలజీ, 50-MP కెమెరా సెటప్ ఉన్నాయి. OnePlus 10T iQOO 9Twతో పోటీపడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. ఒకే ధర ట్యాగ్‌తో మార్కెట్లోకి వచ్చింది.

OnePlus 10T అమెజాన్‌లో రూ. 49,999 వద్ద ప్రారంభమైంది. ICICI బ్యాంక్, SBI కార్డ్ ఉంటే ధర దాదాపు రూ. 5000 తగ్గించవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేయొచ్చు. దీనిపై అమెజాన్ రూ. 5000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. ICICI బ్యాంక్ కార్డ్‌లతో పాటు, SBI కార్డ్‌లపై కూడా ఆఫర్ వ్యాలిడిటీని అందిస్తుంది. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో SBI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, EMI లావాదేవీలపై కూడా కంపెనీ రూ. 5వేల వరకు ఆఫర్ చేస్తోంది. కొనుగోలుదారులు Android, iOS డివైజ్‌ల్లో OnePlus.in, OnePlus స్టోర్ యాప్ Amazon.inలో రూ. 3వేల విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.

OnePlus 10T First sale in India today Check out price, specifications and deals on smartphone

OnePlus 10T First sale in India today Check out price, specifications and deals on smartphone

OnePlus 10T: స్పెసిఫికేషన్‌లు ఇవే :
OnePlus 10T LTPO టెక్నాలజీ సపోర్టుతో 6.7-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రొటెక్షన్ కోసం.. OnePlus 10T కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో వచ్చింది. డిస్‌ప్లే 120Hz, HDR10+ సపోర్టుతో వస్తుంది. ముందు భాగంలో, సెల్ఫీ కెమెరా డిస్‌ప్లే పంచ్-హోల్ కటౌట్ ఉంది. OnePlus 10T స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్ ద్వారా వచ్చింది. ఈ డివైజ్ 3D కూలింగ్ సిస్టమ్‌తో వచ్చింది. హుడ్ కింద OnePlus 10T రిటైల్ బాక్స్‌లో 160W ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్టుతో 4,800mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఫోన్ బ్యాటరీని 19 నిమిషాల్లో 0 నుంచి100 శాతం పూర్తవుతుందని పేర్కొంది. ఈ డివైజ్‌లో డాల్బీ అట్మాస్, నాయిస్ క్యాన్సిలేషన్‌కు సపోర్ట్ ఉంది. కెమెరా విభాగంలో, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OIS సపోర్టుతో పాటు 50-MP సోనీ IMX769 సెన్సార్ ఉంటుంది. 8-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2-MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 16-MP కెమెరా యూజర్లను ఆకట్టుకునేలా ఉంది.

Read Also : OnePlus Nord CE : వన్‌ప్లస్ Nord CE స్మార్ట్‌ఫోన్‌లో కొత్త ఆండ్రాయిడ్ 12OS అప్‌డేట్ వచ్చేసింది!