OnePlus 11 Series : వన్‌‌ప్లస్ 11 సిరీస్ వచ్చేస్తోంది.. అధికారిక లాంచ్‌కు ముందే కొత్త ఫీచర్లు లీక్..!

OnePlus 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) రాబోయే నెలల్లో అనేక కొత్త ప్రొడక్టులను లాంచ్ చేయనుంది. సరసమైన OnePlus Nord CE 3 5Gతో మాదిరిగానే OnePlus 11 సిరీస్‌ను కూడా నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

OnePlus 11 Series : వన్‌‌ప్లస్ 11 సిరీస్ వచ్చేస్తోంది.. అధికారిక లాంచ్‌కు ముందే కొత్త ఫీచర్లు లీక్..!

OnePlus 11 is coming soon, new details leak ahead of official launch

OnePlus 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) రాబోయే నెలల్లో అనేక కొత్త ప్రొడక్టులను లాంచ్ చేయనుంది. సరసమైన OnePlus Nord CE 3 5Gతో మాదిరిగానే OnePlus 11 సిరీస్‌ను కూడా నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. లైనప్‌లో వన్‌ప్లస్ 11, వన్‌ప్లస్ 11 ప్రోతో సహా రెండు డివైజ్‌లు ఉన్నాయి. గతంలో, ఒక లీక్ OnePlus 11 Pro గురించి అన్ని వివరాలను వెల్లడించింది. ఇప్పుడు కొత్త లీక్ OnePlus 11 అందించే కొన్ని స్పెసిఫికేషన్‌లను వివరిస్తుంది.

డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం.. OnePlus 11, Oppo Find N2 మాదిరిగా అదే కెమెరా స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో రానుంది. లీక్‌ల ప్రకారం.. OnePlus 11 ఫోన్ 50-MP Sony IMX890 ప్రైమరీ కెమెరాతో పాటు 48-MP అల్ట్రా-వైడ్ షూటర్, 32-MP Sony IMX709 టెలిఫోటో కెమెరాను అందిస్తుంది. 2x ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది.

మునుపటి కొన్ని OnePlus ఫ్లాగ్‌షిప్ డివైజ్‌ల మాదిరిగానే.. రాబోయే OnePlus 11 అలాగే Oppo Find N2 కూడా Hasselblad కెమెరా ఆప్టిమైజేషన్‌లను అందించనుంది. OnePlus 11, Oppo Find N2 రెండింటి కెమెరా స్పెసిఫికేషన్‌లు, ఇతర హార్డ్‌వేర్ ఫీచర్లు మారవచ్చని భావిస్తున్నారు. నివేదికలు, లీక్‌ల ప్రకారం.. OnePlus 11 Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో రానుంది. అయితే Oppo Find N2 స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌తో వచ్చింది. Qualcomm నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2ని వచ్చే వారం హవాయిలో జరిగే కంపెనీ సమ్మిట్‌లో లాంచ్ చేయనుంది.

OnePlus 11 is coming soon, new details leak ahead of official launch

OnePlus 11 is coming soon, new details leak ahead of official launch

OnePlus 11 Pro స్పెసిఫికేషన్లు లీక్ :
గతంలో, OnePlus 11 ప్రో ఫుల్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. OenPlus 11 లైనప్ అధికారికంగా ఎప్పుడు వెళ్తుందో కంపెనీ రివీల్ చేయలేదు. OnePlus 11 Pro లేటెస్ట్ డిజైన్ లాంగ్వేజీతో పాటు పవర్ ఫుల్ డివైజ్ అని లీక్ సూచిస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌లో రీడిజైన్ చేసిన కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది.

స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే.. OnePlus 11 Pro 6.7-అంగుళాల AMOLED QHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 50-MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, 16-MP ఫ్రంట్ కెమెరా, 16GB RAM, గరిష్టంగా 16GB RAMతో రానుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజీ, 5000mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రానుంది. OnePlus 11 సిరీస్ లేదా ఆఫర్‌లకు సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించలేదు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus Nord CE 3 : వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. సరసమైన ధరకే రావొచ్చు!