OnePlus Flagship Phone : సరసమైన ధరకే వన్‌ప్లస్ 11R వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 7న లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

OnePlus Flagship Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సరసమైన ధరకే రాబోతోంది. వచ్చే వారం ఫిబ్రవరి 7న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.

OnePlus Flagship Phone : సరసమైన ధరకే వన్‌ప్లస్ 11R వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 7న లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

OnePlus 11R launching in India next week _ Everything about affordable OnePlus flagship phone

OnePlus Flagship Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సరసమైన ధరకే రాబోతోంది. వచ్చే వారం ఫిబ్రవరి 7న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. దాదాపు రెండు ఏళ్ల క్రితమే OnePlus భారత మార్కెట్లో ప్రైమరీ OnePlus 9, 9 ప్రో ధరలను భారీగా పెంచేసింది. వన్‌ప్లస్ యూజర్లకు సరసమైన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లను అందించేందుకు కంపెనీ OnePlus 9Rని లాంచ్ చేసింది ఆ తర్వాత OnePlus 10R ఎడిషన్ గత ఏడాదిలో లాంచ్ అయింది. కంపెనీ సేల్ ధరను పెంచకుండానే ఛార్జింగ్ స్పీడ్150Wకి పెంచింది. ఈ ఏడాదిలో కంపెనీ మళ్లీ OnePlus 11R అనే అప్‌గ్రేడ్ వెర్షన్ తీసుకొస్తోంది. కంపెనీ Qualcomm పాత ఫ్లాగ్‌షిప్, Snapdragon 8 Gen 1 Plus చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ కంపెనీ Snapdragon 8 Gen 1 Plus Snapdragon 8 Gen 1 కన్నా పవర్‌ఫుల్ అని చెప్పవచ్చు. OnePlus అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ OnePlus 10 Pro 5Gకి పవర్ అందిస్తుంది. కానీ, Snapdragon 8 Gen 1 Plus గరిష్ట వేగం 3.2GHzకి బదులుగా 3.00GHzకి పరిమితం చేసినట్టు నివేదిక పేర్కొంది. OnePlus 11R, OnePlus 11, 65-అంగుళాల Q2 Pro TV, OnePlus Tab, OnePlus Buds Pro 2 ఇయర్‌బడ్స్ వంటి వన్‌ప్లస్ ప్రొడక్టులతో పాటు ఫిబ్రవరి 7న లాంచ్ కానుంది.

Read Also : Netflix Password Sharing : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై ఫ్రీగా పాస్‌వర్డ్ షేరింగ్ చేసుకోలేరు.. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ల జాబితా మీకోసం..!

అధికారిక లాంచ్‌కు ముందు కంపెనీ గ్రే, ఇష్ వేరియంట్ రివీల్ చేసింది. అయినప్పటికీ, OnePlus 11R గ్లోబల్ వెబ్‌సైట్‌లలో లిస్టు చేసింది. భారతీయ మార్కెట్‌కు పరిమితం చేసినట్టు కనిపిస్తోంది. అధికారిక స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన లీక్‌లు ఇప్పటికే OnePlus 11R ముఖ్య స్పెసిఫికేషన్‌లను అందించాయి. OnePlus రాబోయే OnePlus 11 5G టాప్-క్లాస్ OnePlus స్మార్ట్‌ఫోన్‌ల కోసం స్వీడిష్ కెమెరా కంపెనీ Hasselbladతో షేరింగ్ కొనసాగించవచ్చు. ఈ సరసమైన ఎడిషన్‌లో హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ కెమెరాలు లేవు. OnePlus 11R ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉండనుంది.

OnePlus 11R launching in India next week _ Everything about affordable OnePlus flagship phone

OnePlus 11R launching in India next week _ Everything about affordable

OnePlus 11R స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
రాబోయే OnePlus 11R 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. బేస్ మోడల్ ధర టాప్ మోడల్‌లో 12GB వరకు RAM ఉండవచ్చు. OnePlus స్మార్ట్‌ఫోన్‌లలో సాధారణ మెమరీ కాన్ఫిగరేషన్ కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుందని నివేదిక తెలిపింది. ఇతర ముఖ్య ఫీచర్లలో 1.5K రిజల్యూషన్ (2,772×1,240 పిక్సెల్‌లు)తో కూడిన 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 5G కనెక్టివిటీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.

50MP ప్రైమరీ + 8MP అల్ట్రా-వైడ్ + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. ముందు భాగంలో 16-MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ధర వివరాలపై క్లారిటీ లేదు. స్పెసిఫికేషన్ల ప్రకారం.. ధర రూ. 35వేల కన్నా ఎక్కువగా ఉండవచ్చు. OnePlus 10R ధర రూ. 32,999 (80W ఛార్జింగ్ సపోర్ట్)కి అందుబాటులో ఉంది. 150W ఛార్జింగ్ సపోర్ట్‌తో టాప్ మోడల్ ధర రూ. 37,999గా ఉంది. రాబోయే OnePlus 11 ధర అదే రేంజ్‌లో ఉండవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Oppo Reno 8T Launch : 108MP కెమెరాతో ఒప్పో రెనో 8T వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ డేట్ ఎప్పుడంటే? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?