OnePlus Nord CE 3 : వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. సరసమైన ధరకే రావొచ్చు!
OnePlus Nord CE 3 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి Nord CE 3 కొత్త మోడల్ ఫోన్ వస్తోంది. ఇప్పటివరకూ OnePlus అనేక మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. చాలా గ్యాప్ తర్వాత కొత్త OnePlus Nord ఫోన్ లాంచ్ చేసే పనిలో పడిందని ఓ నివేదిక సూచిస్తుంది.

OnePlus Nord CE 3 may launch sooner than expected, specifications leaked
OnePlus Nord CE 3 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి Nord CE 3 కొత్త మోడల్ ఫోన్ వస్తోంది. ఇప్పటివరకూ OnePlus అనేక మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. చాలా గ్యాప్ తర్వాత కొత్త OnePlus Nord ఫోన్ లాంచ్ చేసే పనిలో పడిందని ఓ నివేదిక సూచిస్తుంది. రాబోయే OnePlus Nord CE 3 గురించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. లేటెస్ట్ నివేదికల ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ గురించి అనేక వివరాలను వెల్లడించాయి. ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే ఏడాదిలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

OnePlus Nord CE 3 may launch sooner than expected, specifications leaked
టిప్‌స్టర్ ఆన్‌లీక్స్, గాడ్జెట్గ్యాంగ్ నివేదిక ప్రకారం.. OnePlus Nord CE 3 చాలా స్పెసిఫికేషన్లతో రానుంది. స్మార్ట్‌ఫోన్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో లాంచ్ కానున్నట్లు కనిపిస్తోంది. కానీ, దీనికి సంబంధించి నిర్దిష్ట వివరాలు రివీల్ చేయలేదు. కానీ, ఇప్పుడు ఈ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ అనుకున్నదానికంటే త్వరగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. OnePlus Nord CE 3 కొన్ని ఫ్లాగ్షిప్-స్థాయి ఫీచర్లను అందించనుంది. అయితే ధర సరసమైనదిగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ 108-MP ప్రైమరీ కెమెరా, 120హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌తో వస్తుందని లీక్ డేటా సూచిస్తుంది.
Nord CE 3 స్పెసిఫికేషన్స్ లీక్ :
రాబోయే OnePlus స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల IPS LCD డిస్ప్లేతో రానుందని భావిస్తున్నారు. OnePlus Nord CE 3 గరిష్టంగా 12GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుందని లీక్ సూచిస్తుంది. కెమెరాల పరంగా కూడా OnePlus ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో OnePlus Nord CE 2 కన్నా పెద్ద అప్‌గ్రేడ్ అవుతుంది. OnePlus Nord CE 3 108-MP ప్రైమరీ కెమెరాతో పాటు డ్యూయల్ 2-MP కెమెరా సెటప్‌తో వస్తుందని లీక్ సూచిస్తుంది. ముందు భాగంలో, స్మార్ట్‌ఫోన్ సెల్ఫీల కోసం.. 16-MP కెమెరాను ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు.

OnePlus Nord CE 3 may launch sooner than expected, specifications leaked
అదనంగా, OnePlus ఫోన్ USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌లో 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుందని లీక్ పేర్కొంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు OnePlus Nord CE 3 గురించి ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది. కచ్చితమైన తేదీ లేదా లాంచ్ టైమ్‌లైన్ ఇంకా వెల్లడించలేదు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..