Seethanagaram Rape Case: కొనసాగుతున్న సామూహిక అత్యాచారం కేసు సస్పెన్స్!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గుంటూరు జిల్లా సీతానగరం సామూహిక అత్యాచార కేసులో సస్పెన్స్ కొనసాగుతోనే ఉంది. అత్యాచారం జరిగి ఐదు రోజులు గడిచినా పోలీసులు నిందితుల ఆచూకీ కనుగొనలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్లేడ్, గంజాయి బ్యాచ్ లను విచారిస్తున్న పోలీసులు శుక్రవారం బాధితురాలు ఇచ్చిన సమాచారంతో కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తుంది.

Seethanagaram Rape Case: కొనసాగుతున్న సామూహిక అత్యాచారం కేసు సస్పెన్స్!

Seethanagaram Rape Case

Seethanagaram Rape Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గుంటూరు జిల్లా సీతానగరం సామూహిక అత్యాచార కేసులో సస్పెన్స్ కొనసాగుతోనే ఉంది. అత్యాచారం జరిగి ఐదు రోజులు గడిచినా పోలీసులు నిందితుల ఆచూకీ కనుగొనలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్లేడ్, గంజాయి బ్యాచ్ లను విచారిస్తున్న పోలీసులు శుక్రవారం బాధితురాలు ఇచ్చిన సమాచారంతో కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తుంది.

ప్రధాన నిందితులైన ఇద్దరి కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తుండగా.. ప్రధాన నిందితుల స్నేహితులు, బంధువుల ఇళ్లలో కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అసలేం జరిగింది అనే విషయంపై పలుమార్లు బాధితురాలి స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయగా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులను గుర్తించామని హోంమంత్రి సుచరిత తెలిపగా.. వారి ఆచూకీ మాత్రం తేలకుండాపోయింది.

ఇటీవల విహారానికి వెళ్లిన ప్రేమ జంటపై తాడేపల్లి ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద దాడి చేసిన విషయం తెలిసింది. యువకుడి కాళ్లూ చేతులూ కట్టేసి, యువతిపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించగా ఈ కేసులో మొబైల్ ఫోన్లు కీలకంగా మారాయి. బాధితురాలితో పాటు ఆమెతో ఉన్న యువకుడి సెల్ పోన్లు నిందితులు లాక్కొని వాటిని సీతానగరంలో తాకట్టు పెట్టారు. ఫోన్లు తాకట్టు పెట్టుకున్న ముగ్గురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరొకరి కోసం గాలిస్తున్నారు. గ్యాంగ్ రేప్ కేసులో వెంకటేష్ తో పాటు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే వారు పరారీలో ఉండగా పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.