Onion juice : బానపొట్టను కరిగించే ఉల్లిపాయరసం…ఇంకా మరెన్నో ఉపయోగాలు!…

బ్లడ్ షుగర్‌ను బ్యాలెన్స్ చేస్తోంది. ఉల్లిపాయ రసాన్ని తీసుకునేవారు సులభంగా బ్లడ్ షుగర్‌ను తగ్గించుకోవచ్చు. శీతాకాలంలో జలుబు సమస్య తరచుగా వేధిస్తుంటుంది.

Onion juice : బానపొట్టను కరిగించే ఉల్లిపాయరసం…ఇంకా మరెన్నో ఉపయోగాలు!…

Omion Juice

Onion juice : ఉల్లిపాయ రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు ఎ,బి ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఇందులో ముఖ్యమైన ఖనిజాలుగా ఉంటాయి. ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు భిన్నంగా ఉంటాయి. అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలను రోజూ కూరల్లో వేసుకొని వండుకొని తింటాం. ఏ ఆహారమైనా అందులో ఉల్లిగడ్డ తప్పకుండా ఉంటుంది.

ఉల్లిపాయ రసం క్యాన్సర్ ను నివారిస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కఫాన్ని తొలగిస్తుంది. ఉల్లిపాయ రసంలో యాంటి అలర్జిటిక్ యాంటీ ఆక్సిడెంట్‌, యయాంటి కార్సినోజెనిక్ లక్షణాలున్నాయి. ఉల్లిపాయ రసం తీసుకోవడం వల్ల ప్రధాన వ్యాధుల నుంచి విముక్తి పొందొచ్చు. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి.

కిడ్నీలలో రాళ్లుండి నొప్పితో బాధపడుతుంటే ఉపశమనం పొందేందుకు ఉల్లిపాయ వినియోగం ప్రభావంతంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్ళ నొప్పితో బాధపడేవారు ఉల్లిపాయ రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉదయాన్నే పరగడుపుతో ఉల్లిరసం తాగితే రాళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

బ్లడ్ షుగర్‌ను బ్యాలెన్స్ చేస్తోంది. ఉల్లిపాయ రసాన్ని తీసుకునేవారు సులభంగా బ్లడ్ షుగర్‌ను తగ్గించుకోవచ్చు. శీతాకాలంలో జలుబు సమస్య తరచుగా వేధిస్తుంటుంది. జలుబు, ఫ్లూతో బాధపడుతున్నవారు పచ్చి ఉల్లిపాయ లేదా దాని రసాన్ని తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులు, లేదా ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు ఉల్లిపాయ రసంతో పాటు ఆవాల నూనెతో మర్ధన చేయాలి. ఇలా చేయడం ద్వారా కీళ్ల నొప్పులు తొలగిపోతాయి. జుట్టు దట్టంగా పెరుగుతుంది.

పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉల్లిలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతము చేస్తాయి. జట్టు రాలే సమస్య ఉన్న వారు ఈ జ్యూస్‌ని జుట్టుకు పట్టిస్తే సమస్య తగ్గుతుంది. గుప్పెడు కరివేపాకు పేస్టును తీసుకుని, అందుకు ఒక స్పూన్ ఉల్లి రసాన్ని చేర్చి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు బాగా పట్టించి.. ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం వుంటుంది.

ఉల్లిపాయ రసం కొద్ది మోతాదులో తీసుకోవటం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. ఇందులో ఉండే భాస్వరం ఆమ్లం రక్తాన్ని శుభ్రం చేయటానికి దోహదపడుతుంది. ఇలా చేయటం వల్ల మొఖంపై మొటిమల సమస్య తొలగిపోతుంది. పొట్ట బాగా ఎక్కువగా ఉన్నవాళ్లు.. ఉల్లిపాయ రసాన్ని తేనెతో కలిపి నిత్యం తీసుకోవాలి. అలా చేస్తే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఒక ఉల్లిగడ్డను తీసుకొని చిన్నచిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి బాగా మొత్తగా చేయాలి. ఆ మిశ్రమాన్ని నీటిలో వేసి కలపాలి. దాంట్లో కాసింత తేనె వేసి నిత్యం తాగుతూ ఉండాలి. ఈ పానీయాన్ని ఉదయమే పరగడుపున తాగాలి. దీంతో పొట్ట తగ్గుతుంది.