వేడుకగా కుక్కపిల్ల గృహప్రవేశం, ఇది ఇండియాలో మాత్రమే సాధ్యం, వైరల్‌గా మారిన టిక్ టిక్ వీడియో

సాధారణంగా మన దేశంలో పెళ్లయిన జంట ఇంటికొస్తే వారికి ఘనంగా వెల్‌కమ్ చెబుతాం. హారతి ఇస్తాం. కుడి

  • Published By: naveen ,Published On : June 14, 2020 / 08:57 AM IST
వేడుకగా కుక్కపిల్ల గృహప్రవేశం, ఇది ఇండియాలో మాత్రమే సాధ్యం, వైరల్‌గా మారిన టిక్ టిక్ వీడియో

సాధారణంగా మన దేశంలో పెళ్లయిన జంట ఇంటికొస్తే వారికి ఘనంగా వెల్‌కమ్ చెబుతాం. హారతి ఇస్తాం. కుడి

సాధారణంగా మన దేశంలో పెళ్లయిన జంట ఇంటికొస్తే వారికి ఘనంగా వెల్‌కమ్ చెబుతాం. హారతి ఇస్తాం. కుడి కాలు ఇంట్లోకి పెట్టి రావాలని ఆహ్వానిస్తాం. ఇక గృహ ప్రవేశాల సమయంలోనూ ఇలాంటి సీన్ కనిపిస్తుంది. నూనతంగా నిర్మించుకున్న ఇంట్లోకి అడుగుపెట్టే ముందు ఇంటి యజమానికి స్వాగతం పలుకుతారు. వారికి హారతి ఇస్తారు, బొట్టు పెడతారు, పూజలు కూడా చేస్తారు. ఇది మన దేశ సంప్రదాయంలో భాగం. కానీ ఫస్ట్ టైమ్ ఓ కుక్క పిల్ల విషయంలో ఓ రేంజ్ లో గృహ ప్రవేశం వేడుక నిర్వహించారు. దీనికి సంబంధించిన టిక్ టిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఎంతో గ్రాండ్‌గా పప్పీ గృహప్రవేశం:
ఇది ఎక్కడ జరిగిందో తెలీదు కానీ, ఓ ఇంట్లో కుక్క పిల్ల గృహ ప్రవేశం వేడుక ఘనంగా నిర్వహించారు. ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులు కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకున్నారు. అయితే ఇంట్లోకి తీసుకెళ్లే ముందు ఆ బుజ్జి కుక్కతో గృహ ప్రవేశం చేయించారు. దానికి బొట్టు పెట్టారు. ఆ తర్వాత హారతి పెట్టారు. ఆ తర్వాత ఓ వస్త్రం మీద దాని కాలి ముద్రలు పెట్టారు. ఇలా ఎంతో గ్రాండ్ గా గృహ ప్రవేశం నిర్వహించారు. ఆ పప్పీని తమ ఫ్యామిలీ మెంబర్‌గా చేసుకున్నారు. దీన్నంతా వీడియో తీశారు. బ్యాంక్ గ్రౌండ్‌లో బాలీవుడ్ మూవీ కబీ కుషీ కబీ గమ్(kabhi khushie kabhi gham) సినిమాలో లతా మంగేష్కర్ పాడిన పాపులర్ సాంగ్ ని యాడ్ చేశారు. 

నెటిజన్ల హృదయాలు గెల్చుకున్న వీడియో:
తమ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ను ఆ కుటుంబసభ్యులు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఈ కుక్క పిల్ల గృహ ప్రవేశం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్ల హృదయాలు గెలుచుకుంది. వారు యాడ్ చేసిన సాంగ్ బాగా యాప్ట్ అయ్యిందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభం సమయంలో అందరూ భయపడుతూ బతుకున్నారు. ఎక్కడ చూసినా కరోనా కేసులు, మరణాల వార్తలే వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వీడియోలు మన మూడ్ ని మారుస్తున్నాయని నెటిజన్లు కామెంట్ చేశారు. విశ్వాసానికి మారు పేరు కుక్క. మన దేశంలో కుక్కలను పెంచుకోవడం కామన్. వాటిని ఓ జంతువులా చూడరు. ఇంట్లో కుటుంసభ్యుల్లో ఒకరిలా చూసుకుంటారు, ప్రేమిస్తారు.

@riyap00

welcome home benji ##puppy ##k3g ##indian

♬ Kabhi Khushi Kabhi Ghum Female – Lata Mangeshkar