కొత్త పీసీసీ చీఫ్‌పై అభిప్రాయ సేకరణ..సమావేశం మధ్యలోనే బయటకొచ్చిన ఉత్తమ్‌

  • Published By: bheemraj ,Published On : December 9, 2020 / 09:06 PM IST
కొత్త పీసీసీ చీఫ్‌పై అభిప్రాయ సేకరణ..సమావేశం మధ్యలోనే బయటకొచ్చిన ఉత్తమ్‌

Opinion poll on new TPCC chief : హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో టీపీసీసీ కోర్‌కమిటీ సమావేశం ముగిసింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో నెక్ట్స్ పీసీసీ చీఫ్ ఎవరైతే బెటరనేదానిపై ఇన్‌ఛార్జ్‌ మానిక్కమ్‌ ఠాకూర్‌ నేతల అభిప్రాయాలను విడివిడిగా సేకరిస్తున్నారు. రేపు, ఎల్లుండి కూడా నేతల అభిప్రాయం తీసుకోనున్నారు. అయితే సమావేశం మధ్యలోనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బయటకు వచ్చారు. కొత్త పీసీసీ చీఫ్‌పై తన అభిప్రాయం వెల్లడించలేదన్నారు ఉత్తమ్‌. సోనియాగాంధీ నిర్ణయమే తనకు ఫైనల్ అన్నారు.



తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఫలితాల అనంతరం నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.

కొత్త పీసీసీ చీఫ్ కు సంబంధించిన ప్రాసెస్ ను కూడా ప్రారంభించాలని ఏఐసీసీకి సూచించడంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మానిక్కమ్ ఠాకూర్ ఇవాళ తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్ లో పార్టీ సీనియర్ నేతలందరితో ఈ ప్రక్రియకు సంబంధించి ప్రారంభించారు.



తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిని డెమోక్రటిక్ పద్ధతిలో ఎంపిక చేయబోతున్నట్లు మానిక్కమ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అన్ని వర్గాలకు సంబంధించిన నేతలతో ఏకాభిప్రాయం తీసుకుని అందరి సమన్వయంతో పీసీసీ అధ్యక్షున్ని ఎంపిక చేస్తామని చెప్పారు.



ఇవాళ కోర్ కమిటీ సమావేశం అయింది. ఒక్కొక్క కోర్ కమిటీ సభ్యుడిని విడిగా అభిప్రాయం తీసుకున్నారు. వన్ టు వన్ మీటింగ్ ప్రారంభమైంది. సీనియర్ నేత వీహెచ్ నుంచి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీని బతికించడంతోపాటు 2023లో అధికారంలోకి వచ్చే లక్ష్యంతో పార్టీని సమర్థవంతంగా నిలబెట్టాలని మానిక్కమ్ ఠాకూర్ చెప్పారు.



అందుకనుగుణంగా ఎవరైతే సమర్థవంతంగా పార్టీని లీడ్ చేయగలుగుతారన్న ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నారు. ఈ ప్రక్రియను ఈరోజు, రేపుతోపాటు ఎల్లుండి మూడు రోజులపాటు కాంగ్రెస్ పార్టీలోని అన్ని విభాగాల నేతలతో ప్రాసెస్ చేయనున్నారు.