Emergency కూడా ఇంత భయంకరంగా లేదు: BJPపై శివసేన ఫైర్

‘‘నిజాలు మాట్లాడే వారి నాలుక కోయాలని, గొంతు నొక్కేయాలని ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు అనుకుంటున్నారు. ఇందిరా విధించిన ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇంతటి భయానక పరిస్థితులు లేవు’’ అని సామ్నా అభిప్రాయపడింది. 1975-77 మధ్యలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో విపక్ష నేతలను, జర్నలిస్టులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు. కాగా, కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకుని విపక్షాలను భయభ్రాంతులకు గురి చేసి అధికారం అనుభవించాలని బీజేపీ ఆరాటపడుతోందని సామ్నా విమర్శించింది.

Emergency కూడా ఇంత భయంకరంగా లేదు: BJPపై శివసేన ఫైర్

Maharashtra: మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ రోజుల కంటే ప్రస్తుత భారతీయ జనతా పార్టీ పాలన భయంకరంగా ఉందని శివసేన(Shiv sena) విమర్శలు గుప్పించింది. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్(Sanjay Raut)ను ఈడీ అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్న శివసేన.. కేంద్ర ప్రభుత్వం విపక్షాలపై ఎన్నడూ లేని విధంగా టార్గెట్ చేస్తూ దేశంలో భయానక పరిస్థితుల్ని సృష్టిస్తోందని మండిపడింది. తాజాగా శివసేన అధికారిక పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో మోదీ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోసింది. ప్రతిపక్షాన్ని గౌరవంగా చూడకపోతే ప్రజాస్వామ్యం నాశనం అవుతుందని సామ్నా హితవు పలికింది.

సంజయ్ రౌత్ తొందరలోనే క్లీన్ చిట్ తీసుకుని వస్తారని, ఆయనపై బీజేపీ వేసిన తప్పుడు కేసులు అన్నీ తప్పని నిరూపితమవుతాయని సామ్నా పేర్కొంది. ‘‘నిజాలు మాట్లాడే వారి నాలుక కోయాలని, గొంతు నొక్కేయాలని ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు అనుకుంటున్నారు. ఇందిరా విధించిన ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇంతటి భయానక పరిస్థితులు లేవు’’ అని సామ్నా అభిప్రాయపడింది. 1975-77 మధ్యలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో విపక్ష నేతలను, జర్నలిస్టులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు. కాగా, కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకుని విపక్షాలను భయభ్రాంతులకు గురి చేసి అధికారం అనుభవించాలని బీజేపీ ఆరాటపడుతోందని సామ్నా విమర్శించింది.

ల్యాండ్ స్కామ్ (Land Scam) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌రౌత్‌‭ను జూలై 31న ఈడీ అదుపులోకి తీసుకుంది. రూ.వెయ్యి కోట్లకు (1000 Crores) పైగా భూ కుంభకోణానికి పాల్పడినట్లు సంజయ్ రౌత్‌పై ప్రధానంగా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 4 వరకు ఈ కస్టడీ కొనసాగుతుంది. కాగా, సంజయ్‌ రౌత్ అరెస్టు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ, కేంద్రంలోని బీజేపీ కుట్రలో భాగమేనని తాజా మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు. అయితే అన్ని ఆధారాలు సేకరించాకే సంజయ్ రౌత్‭పై ఈడీ చర్యలు ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు.

Malegaon blast caseలో BJP MP Pragya.. ఫోరెనిక్స్ నిపుణుల వెల్లడి