Orey Baammardhi : మన దేశం గురించి తెలుసుకోవాలంటే ఒకొక్కళ్ల ఇంటికెళ్లక్కర్లేదు.. రోడ్లు చెప్పేస్తాయ్..

కొంత గ్యాప్ తర్వాత హీరో సిద్ధార్థ్ ‘గృహం’ అనే థ్రిల్లర్ మూవీతో ట్రాక్‌లోకి వచ్చాడు.. ‘మహాసముద్రం’ అనే మల్టీస్టారర్‌తో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్, సిద్ధార్థ్ నటించిన ‘సివప్పు మంజల్’ సినిమాను తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో విడుదల చెయ్యనున్నారు. ‘బిచ్చగాడు’ ఫేం శశి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లిజోమోల్ జోస్, కాష్మీరా కథానాయికలు..

Orey Baammardhi : మన దేశం గురించి తెలుసుకోవాలంటే ఒకొక్కళ్ల ఇంటికెళ్లక్కర్లేదు.. రోడ్లు చెప్పేస్తాయ్..

Orey Baammardhi

Orey Baammardhi: కొంత గ్యాప్ తర్వాత హీరో సిద్ధార్థ్ ‘గృహం’ అనే థ్రిల్లర్ మూవీతో ట్రాక్‌లోకి వచ్చాడు.. ‘మహాసముద్రం’ అనే మల్టీస్టారర్‌తో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్, సిద్ధార్థ్ నటించిన ‘సివప్పు మంజల్’ సినిమాను తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో విడుదల చెయ్యనున్నారు. ‘బిచ్చగాడు’ ఫేం శశి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లిజోమోల్ జోస్, కాష్మీరా కథానాయికలు..

Orey Baammardhi

రోడ్ రేస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది.. నిర్లక్ష్యంగా బైక్ నడిపే కుర్రాడిగా ప్రకాష్, అతన్ని పట్టుకునే ట్రాఫిక్ పోలీసుగా సిద్ధార్థ్ కనిపించారు.. ఈ సినిమాతో చక్కటి మెసేజ్ ఇవ్వబోతున్నారనిపిస్తోంది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. ‘దేశం గురించి తెలుసుకోవాలంటే ఒకొక్కళ్ల ఇంటికెళ్లక్కర్లేదు సార్.. రోడ్లు చెప్పేస్తాయ్.. దేశం గురించి’.. అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

Orey Baammardhi

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘ఒరేయ్ బామ్మర్ది’ త్వరలో విడుదల కానుంది. ఈ మూవీకి సంగీతం : సిద్ధు కుమార్, కెమెరా : ప్రసన్న ఎస్.కుమార్, డైలాగ్స్ : నందు తుర్లపాటి, లిరిక్స్ : వెన్నెలకంటి, ఎడిటింగ్ : లోకేష్, ఆర్ట్ : ఎస్.ఎస్.మూర్తి, స్టంట్ : ఆర్.శక్తి శరవణన్, నిర్మాత : రమేష్ పి.పిళ్లై..