Telugu Serials : వంటలక్కే టాప్.. వెనకాలే డాక్టర్ బాబు…

ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వే ప్రకారం తెలుగు సీరియల్స్ లో టాప్ 10 స్టార్స్ వీళ్ళే.. 'కార్తీకదీపం' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న దీప క్యారెక్టర్......

Telugu Serials :  వంటలక్కే టాప్.. వెనకాలే డాక్టర్ బాబు…

Telugu Serials

Telugu Serials :   గత కొంత కాలంగా కొన్ని సంస్థలు సెలబ్రిటీలపై సర్వేలు నిర్వహించి ప్రజల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఎవరికి ఉంది, ఎక్కువ ఎవర్ని ఫాలో అవుతున్నారు, ఎవర్ని ఇష్టపడుతున్నారు అని సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇలా సర్వేలు నిర్వహించే సంస్థల్లో ఒకటైన మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా ప్రతి నెల. ప్రతి సంవత్సరం మోస్ట్ పాపులర్ స్టార్స్ అంటూ అన్ని భాషల్లోనూ సర్వే నిర్వహిస్తుంది. తాజాగా 2021 సంబంధించి నిర్వహించిన సర్వేలో అన్ని భాషల్లోనూ సినిమాల పరంగా, సీరియల్స్ పరంగా సర్వే నిర్వహించి టాప్ 10 స్టార్లను వెల్లడించారు.

ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వే ప్రకారం తెలుగు సీరియల్స్ లో టాప్ 10 స్టార్స్ వీళ్ళే.. ‘కార్తీకదీపం’ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న దీప క్యారెక్టర్ (ప్రేమి విశ్వనాధ్) సీరియల్ విభాగంలో టాప్ పొజిషన్ దక్కించుకుంది. దాదాపు మూడు సంవత్సరాలుగా తెలుగు సీరియల్స్ లో టాప్ రేటింగ్ లో కొనసాగుతూ ఎంతోమందికి నచ్చిన సీరియాల్ గా నిలిచింది. ఇందులోని వంటలక్క క్యారెక్టర్ కి తెలుగు ప్రేక్షకులంతా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సర్వేలో కార్తీకదీపం వంటలక్క టాప్ ప్లేస్ లో నిలిచింది.

Telugu Heros : ఆ సర్వేలో ఫస్ట్ ప్లేస్‌లో మహేష్ తర్వాతే అల్లు అర్జున్.. తర్వాతి స్థానాలు..

ఆ తర్వాత అదే సీరియల్ నుంచి డాక్టర్ బాబు క్యారెక్టర్ తో ఫేమస్ అయినా నిరుపమ పరిటాల సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఆ తర్వాత మూడవ స్థానం నుంచి పదవ స్థానం వరకు వరుసగా… ‘రాధమ్మ కూతురు’ సీరియల్ అక్షర క్యారెక్టర్, ‘త్రినయని’ సీరియల్ లో నయని క్యారెక్టర్, ‘జానకి కలగనలేదు’ సీరియల్ లో జానకి క్యారెక్టర్, ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ లో తులసి క్యారెక్టర్, ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ లో ఆర్య క్యారెక్టర్, ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో రిషి క్యారెక్టర్, ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో వసుంధర క్యారెక్టర్, ‘కల్యాణ వైభోగం’లో మంగ క్యారెక్టర్ లు నిలిచాయి.