Ram Nath Kovind: రేపు జాతినుద్దేశించి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. ఆల్ ఇండియా రేడియోతోపాటు, దూరదర్శన్‌లో ప్రసంగం ప్రసారమవుతుంది.

Ram Nath Kovind: రేపు జాతినుద్దేశించి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం

Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇది రాష్ట్రపతిగా ఆయన చివరి ప్రసంగం కానుంది. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం శనివారం ప్రకటించింది.

Startups: దేశంలో పెరుగుతున్న స్టార్టప్‌లు… ఆరేళ్లలో గణనీయ ప్రగతి

ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు ఆల్ ఇండియా రేడియోతోపాటు, అన్ని దూరదర్శన్ ఛానెళ్లలో ఈ ప్రసంగం ప్రసారమవుతుంది. ప్రాంతీయ దూరదర్శన్ ఛానెళ్లలో కూడా ప్రసారమవ్వనున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. హిందీతోపాటు, ఇంగ్లీష్ వెర్షన్‌లో కూడా ప్రసారమవుతుంది. ఆల్ ఇండియా రేడియోకు సంబంధించి ప్రాంతీయ భాషా ఛానెళ్లలో, రాత్రి తొమ్మిదిన్నరకు స్థానిక భాషల్లో కూడా ప్రసారమవుతుంది. మరోవైపు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు సమావేశం శనివారం జరిగిన సంగతి తెలిసిందే.

Woman Gang-Raped: ఫంక్షన్ కోసం పిలిచి మహిళపై రైల్వే సిబ్బంది అత్యాచారం

న్యూ ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, ఇతర అతిథులు పాల్గొన్నారు. ద్రౌపది ముర్ము నూతన రాష్ట్రపతిగా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన ఎంపీలు పాల్గొంటారు.