Ukraine: యుక్రెయిన్‌లో ఇళ్ళు వ‌దిలి దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌కు 62 ల‌క్ష‌ల మంది

ర‌ష్యా-యుక్రెయిన్ మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతోంది. యుద్ధం కార‌ణంగా యుక్రెయిన్‌ను విడిచి వెళ్తున్న ప్ర‌జ‌ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది.

Ukraine: యుక్రెయిన్‌లో ఇళ్ళు వ‌దిలి దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌కు 62 ల‌క్ష‌ల మంది

Russia-Ukraine war

ukraine: ర‌ష్యా-యుక్రెయిన్ మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతోంది. యుద్ధం కార‌ణంగా యుక్రెయిన్‌ను విడిచి వెళ్తున్న ప్ర‌జ‌ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇప్ప‌టివ‌ర‌కు యుక్రెయిన్ నుంచి 62 ల‌క్ష‌ల మందికిపైగా ప్ర‌జ‌లు త‌మ ఇళ్ళ‌ను వ‌దిలి అదే దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్ళిపోయార‌ని ఐక్య‌రాజ్య స‌మితిలోని సంబంధిత విభాగం తాజా నివేదిక‌లో పేర్కొంది. అలాగే, 50 ల‌క్ష‌ల మందికి పైగా యుక్రెయిన్‌ ప్ర‌జ‌లు యురోపియ‌న్ దేశాల‌కు వెళ్ళి శ‌ర‌ణార్థులుగా పేర్లు న‌మోదు చేసుకున్నారు. యుక్రెయిన్ ప్ర‌జ‌లు ఆరోగ్య సేవ‌లు, విద్య‌, పున‌రావాస సేవ‌లు అందుకోలేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

Maharashtra: న‌డ్డాతో ఫ‌డ్న‌వీస్ భేటీ.. ప్ర‌భుత్వ ఏర్పాటుపై చ‌ర్చ‌

మ‌రోవైపు, యుక్రెయిన్‌లోని జ‌నావాసాల‌ను కూడా ల‌క్ష్యంగా చేసుకుని ర‌ష్యా దాడులు చేస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్ర‌పంచ దేశాల నుంచి ఎంత ఒత్తిడి వ‌స్తున్న‌ప్ప‌టికీ ర‌ష్యా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. తాజాగా, యుక్రెయిన్‌లోని క్రెమెన్‌చుక్ న‌గ‌రంలో 1,000 మంది ఉన్న షాపింగ్ మాల్‌పై ర‌ష్యా క్షిప‌ణి దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 20 మంది సామాన్య ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. మృతులు/క్ష‌త‌గాత్రుల వివ‌రాల‌ను స్ప‌ష్టంగా తెలియట్లేదు.