Vitamin E : విటమిన్ ఇ సప్లిమెంట్స్ పరిమితికి మించి వాడేస్తున్నారా? అయితే జాగ్రత్త

మనం రోజు వారిగా తీసుకునే అనేక ఆహారాల ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ ఇని పొందవచ్చు. ముఖ్యంగా పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, మిరియాలు, బీన్స్, పప్పు ధాన్యాలు, అవకాడో, సాల్మొన్ చేపలు, గుడ్లు, బాదం గింజలు, డ్రై ఫ్రూట్స్, పొద్దు తిరుగుడు గింజలు, పండ్ల రసాలు , సోయాబీన్ వంటి వాటి ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ ఇ అందుతుంది.

Vitamin E : విటమిన్ ఇ సప్లిమెంట్స్ పరిమితికి మించి వాడేస్తున్నారా? అయితే జాగ్రత్త

Vitamin E

Vitamin E : విటమిన్ ఇ శరీరానికి శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి పెంచటంలో ఉపకరిస్తుంది. చర్మానికి విటమిన్ ఇ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. హానికారక కాలుష్య కారల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. పొడిబారిన చర్మానికి తేమను సమకూరుస్తుంది. కళ్ల పనితీరుకు దోహదపడుతుంది. విటమిన్ ఇలో ఒక భాగమైన ఆల్ఫా టోకోఫెరోల్ కంటి శుక్లాలు రాకుండా నివారిస్తాయి. మెదడు కణాల్లో ఒత్తిడిని తగ్గించటం ద్వారా అల్జిమర్ష్ వంటి లక్షణాలను తగ్గించటంలో తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యానికి ఇది సహాయకారిగా ఉపయోగపడుతుంది.

మనం రోజు వారిగా తీసుకునే అనేక ఆహారాల ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ ఇని పొందవచ్చు. ముఖ్యంగా పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, మిరియాలు, బీన్స్, పప్పు ధాన్యాలు, అవకాడో, సాల్మొన్ చేపలు, గుడ్లు, బాదం గింజలు, డ్రై ఫ్రూట్స్, పొద్దు తిరుగుడు గింజలు, పండ్ల రసాలు , సోయాబీన్ వంటి వాటి ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ ఇ అందుతుంది. అయితే విటమిన్ ఇ సప్లిమెంట్ల రూపంలో కూడా అందుబాటులో ఉంది. చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో సైతం విటమిన్ ఇ ని ఉపయోగిస్తున్నారు.

అయితే విటమిన్ ఇని సప్లి మెంట్ల రూపంలో తీసుకునే వారు పరిమితి మించి తీసుకోరాదు. వ్యక్తుల రోజు వారి మోతాదు 15ఎంజీకి మించరాదు. అలాకాకుండా అపరిమితంగా తీసుకుంటే మాత్రం అనేక దుష్పప్రభావాలను చవిచూడాల్సి వస్తుంది. మదుమోహులు విటమిన్ ఇని తీసుకోకూడదు. దీని వల్ల కొందరిలో స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. రక్త స్రావం వ్యాధులతో బాధపడుతున్న వారు విటమిన్ ఇ తీసుకోవటం వల్ల సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. కొంతమందిలో విటమిన్ ఇ అపరిమితంగా తీసుకుంటే ప్రోస్టేట్ కాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంటుంది. మోతాదుకు మించితే అలసట, తలనొప్పి, కంటి మసకలు, ఎముకలు బలహీనంగా మారటం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.