Jasmine Cultivation : మల్లె సాగులో యాజమాన్యం

మొక్కలను తేలికపాటి నేలల్లో నాటాలి. జూన్ నుండి డిసెంబర్ వరకు ఎప్పుడైనా నాటుకోవచ్చు. సాయంత్రం వేళ నాటుకోవాలి. మొక్కల మధ్య వరుసల మధ్య రెండు మీటర్ల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.

Jasmine Cultivation : మల్లె సాగులో యాజమాన్యం
ad

Jasmine Cultivation : మహిళల కురులకు అందాన్ని ఇవ్వటంతోపాటు, సువాసనలు వెదజల్లే మల్లపూలకు మార్కెట్లో మంచి గిరాకీ లభిస్తుంది. దీంతో చాలా మంది రైతులు తెలుగు రాష్ట్రాల్లో మల్లెతోటల సాగును చేపడుతున్నారు. వాణిజ్య సరళిలో చేపట్టే ఈ మల్లె తోటల సాగులో సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. మల్లెలో సాధారణంగా విడిమల్లె, దొంతమల్లె, గుండుమల్లె, బొడ్డుమల్లె అనే రకాలను రైతులు సాగు చేస్తున్నారు. మల్లెను కొమ్మ కత్తిరింపుల ద్వారా గానీ , అంటు మొక్కలు తొక్కటం ద్వారాగానీ ప్రవర్ధనం చేయవచ్చు.

మొక్కలను తేలికపాటి నేలల్లో నాటాలి. జూన్ నుండి డిసెంబర్ వరకు ఎప్పుడైనా నాటుకోవచ్చు. సాయంత్రం వేళ నాటుకోవాలి. మొక్కల మధ్య వరుసల మధ్య రెండు మీటర్ల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. మల్లెలో లేత చిగుర్ల నుండే పూలు వస్తాయి. వీటి కత్తిరింపులు తప్పనిసరిగా చేపట్టాలి. కొమ్త కత్తిరింపులకు 15 రోజుల ముందు నీరు కట్టడం ఆపేయాలి. కత్తిరింపుల తరువాత నీరు కట్టడం వల్ల మొక్కలు కొత్తగా చిగురిస్తాయి.

మల్లె తోటలకు అందించాల్సిన ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువుతోపాటు 120 గ్రా, నత్రజని ఎరువు, 120 గ్రా భాసర్వరం , పొటాష్, ఎరువులను కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే ఇవ్వాలి. పూల దిగుబడి పెంచేందుకు లీటరు నీటికి 2.5గ్రాముల జింక్‌ సల్ఫేట్‌, 5.గ్రాముల మెగ్నీషియం, సల్ఫేట్‌ సూక్ష్మ ధాతువులను కలిపి రెండు, మూడు దఫాలుగా పిచికారీ చేయాలి. మొక్కలు నాటిన ఆరు నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్దీ దిగుబడి అధికమవుతుంది. ఎకరానికి సుమారు 3 నుంచి 4 టన్నుల దిగుబడి పొందొచ్చు.