Valimai: ప్రోమోకు పెయిడ్ లైక్స్.. నెట్టింట యాంటీ ఫాన్స్ దుమారం!

గతంలో యాభై రోజులు, వంద రోజులు థియేటర్లలో సినిమా ప్రదర్శించడం.. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో లెక్కలేసి హిట్టు ఫట్టు తేల్చేవాళ్ళు. ఇక పాటల క్యాసెట్లు, సీడీలు అమ్ముడుపోవడాన్ని బట్టి..

Valimai: ప్రోమోకు పెయిడ్ లైక్స్.. నెట్టింట యాంటీ ఫాన్స్ దుమారం!

Valimai Trailer

Valimai: గతంలో యాభై రోజులు, వంద రోజులు థియేటర్లలో సినిమా ప్రదర్శించడం.. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో లెక్కలేసి హిట్టు ఫట్టు తేల్చేవాళ్ళు. ఇక పాటల క్యాసెట్లు, సీడీలు అమ్ముడుపోవడాన్ని బట్టి ఆడియో హిట్ లెక్కలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది పూర్తిగా మారిపోయింది. ఆడియో, వీడియో సాంగ్స్ కు యూట్యూబ్ వ్యూస్ రికార్డులు కాగా.. తొలి రోజు సినిమా ఎంత కలెక్ట్ చేసింది.. తొలి వారంలో ఎంత రాబట్టిందో ఇప్పుడు రికార్డులుగా లెక్కలేస్తున్నారు. అందుకే యూట్యూబ్ లో ఒకరకంగా యుద్ధమే నడుస్తుంది.

Bheemla Nayak: ఏప్రిల్‌కు విడుదల వాయిదా.. కారణం ఏంటంటే?

ఇక తమిళనాడులో స్టార్ హీరోలు విజయ్ దళపతి, తలా అజిత్ ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుండో వార్ నడుస్తుంది. ఇది కాస్త ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెరిగి పెద్దదై ఒకరి సినిమాలపై మరో హీరో ఫ్యాన్స్ నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం.. కామెంట్లతో రెచ్చిపోయి తిట్టుకోవడం వరకు వచ్చింది. ఇప్పుడు అదే పంథాలో అజిత్ సినిమాకి సంబంధించి ఓ ప్రోమోపై యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

Gurthunda Seethakalam Trailar: చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం.. శీతాకాలం!

అజిత్ కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కలిసి నటించిన సినిమా వలిమై. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ఫిబ్రవరి 24వ తేదీన పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అజిత్ మార్క్ యాక్షన్ సినిమా కావడంతో ఈ సినిమాకి సంబంధించి వచ్చిన ప్రతి అప్డేట్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రోమో ఒకటి మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది.

F3 Movie: ఎఫ్3 మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే?

అయితే, ఈ ప్రోమోకి వచ్చిన లైక్స్ జెన్యూన్ కాదని.. పెయిడ్ లైక్స్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కేవలం ప్రచారం మాత్రమే కాదు.. #ValimaiPaidLikesExposed అనే హ్యాష్ ట్యాగ్ తో అజిత్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. దీనికి అజిత్ ఫ్యాన్స్ కూడా కామెంట్లతో ధీటుగా ఆన్సర్ ఇస్తున్నారు. మొత్తంగా ఇది సోషల్ మీడియాలో యుద్ధవాతారణాన్ని సృష్టిస్తుంది. మరి ఈ వార్ ముగిసేది ఎప్పుడో.. హీరోల కోసం అభిమానుల ఈ కొట్లాల ముగిసేది ఎప్పుడో చూడాలి.