Drink Lassi: యూనివర్సిటీల్లో లస్సీనే తాగండి: పాక్ విద్యా శాఖ ఆదేశం

లోకల్ డ్రింక్స్‌ను ప్రోత్సహించడం వల్ల స్థానికులకు ఉపాధి దొరుకుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని హెచ్ఈసీ తన సూచనల్లో పేర్కొంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో పొదుపు చర్యలు ప్రారంభించింది పాక్.

Drink Lassi: యూనివర్సిటీల్లో లస్సీనే తాగండి: పాక్ విద్యా శాఖ ఆదేశం

Drink Lassi

Drink Lassi: పాకిస్తాన్‌లోని యూనివర్సిటీల పరిధిలో టీకి బదులు లస్సీ, సత్తు (మొక్కజొన్న పిండితో చేసే డ్రింక్) వంటి లోకల్ డ్రింక్సే తాగాలని ఆదేశించింది పాక్ ఉన్నత విద్యా శాఖ. ఈ మేరకు వైస్ ఛాన్స్‌లర్లకు పాకిస్తాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (హెచ్ఈసీ) సూచనలు చేసింది. లోకల్ డ్రింక్స్‌ తాగేలా చూడాలని కోరింది.

Uddhav Thackeray: బాలాసాహెబ్ పేరు వాడుకోవద్దు: రెబల్స్‌కు ఉద్ధవ్ వార్నింగ్

లోకల్ డ్రింక్స్‌ను ప్రోత్సహించడం వల్ల స్థానికులకు ఉపాధి దొరుకుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని హెచ్ఈసీ తన సూచనల్లో పేర్కొంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో పొదుపు చర్యలు ప్రారంభించింది పాక్. దీనిలో భాగంగా ఇటీవల దేశ పౌరులు టీ తాగడం తగ్గించాలని సూచించింది. ఎందుకంటే టీ పౌడర్ ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. దీనికి డబ్బులు చెల్లించే పరిస్థితిలో పాకిస్తాన్ లేదు. అప్పు తీసుకుని, టీ పౌడర్ కొనుగోలు చేస్తోంది. అందువల్ల దేశ పౌరులు టీ తాగడం తగ్గిస్తే, ఆ మేరకు విదేశాల నుంచి టీ పౌడర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తగ్గుతుందని ఆ దేశం భావిస్తోంది.

Teachers: టీచర్లు ఆస్తి వివరాలు ఇవ్వాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ

అలాగే స్తానికంగానే తేయాకు ఉత్పత్తి చేయాలని కూడా పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కొనసాగింపుగా యూనివర్సిటీల పరిధిలో లస్సీ, సత్తు వంటి డ్రింక్స్ తాగడాన్ని ప్రోత్సహించాలని సూచించింది. మరోవైపు నిన్న శుక్రవారం పాక్ ట్రేడ్ మార్కెట్లు 2,000 పాయింట్ల మేర కుప్పకూలాయి. దేశంలోని పరిశ్రమలపై అదనంగా పది శాతం పన్ను విధిస్తానని ప్రధాన మంత్రి ప్రకటించడమే ఇందుకు కారణం.