Pakistan: పాక్‌లో 13.76 శాతానికి పెరిగిన ద్ర‌వ్యోల్బ‌ణం

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్‌లో ప‌రిస్థితులు మ‌రింత చేజారుతున్నాయి. మేలో పాకిస్థాన్‌లో ద్ర‌వ్యోల్బ‌ణం 13.76 శాతంగా న‌మోదైంది. రెండున్న‌రేళ్ల‌లో ఈ స్థాయిలో ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డం ఇదే తొలిసారి.

Pakistan: పాక్‌లో 13.76 శాతానికి పెరిగిన ద్ర‌వ్యోల్బ‌ణం

Inflation

Pakistan: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్‌లో ప‌రిస్థితులు మ‌రింత చేజారుతున్నాయి. మేలో పాకిస్థాన్‌లో ద్ర‌వ్యోల్బ‌ణం 13.76 శాతంగా న‌మోదైంది. రెండున్న‌రేళ్ల‌లో ఈ స్థాయిలో ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డం ఇదే తొలిసారి. పాక్‌ ప్ర‌భుత్వ ఖ‌జానాలో నిధులు కూడా అడుగంటిపోతుండ‌డంతో సంక్షేమ‌ ప‌థ‌కాలు ప్ర‌జ‌లకు స‌రైన విధంగా అంద‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌భుత్వం నిత్యావ‌స‌ర ధ‌ర‌ల‌ను పెంచేస్తోంది.

Jammu Kashmir: క‌శ్మీర్‌లో 1989లోనూ ఇలాగే జ‌రిగింది: అస‌దుద్దీన్ ఒవైసీ

ఇటీవ‌లే వంట నూనె ధ‌ర‌ను కూడా పాక్ ప్ర‌భుత్వం అతి భారీగా పెంచిన విష‌యం తెలిసిందే. ఆహార ప‌దార్థాల‌ ద్ర‌వ్యోల్బ‌ణ రేటు 17.25కి చేరింది. త్వరగా పాడైపోయే ఆహార పదార్థాల ధరలు 26.37 శాతం పెరిగాయి. ఈ వివ‌రాల‌ను పాకిస్థాన్ గ‌ణాంకాల సంస్థ (పీబీఎస్‌) తాజాగా వెల్ల‌డించింది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ద్ర‌వ్యోల్బ‌ణం 12.36 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 15.88 శాతం మేర‌ పెరిగింద‌ని పీబీఎస్ వివ‌రించింది.