'Pakadwa Vivah' in Bhihar : పాపం బీహార్ కుర్రాళ్లు..! యువకుల్ని కిడ్నాప్ చేసి..తలపై గన్ పెట్టి బలవంతపు పెళ్లిళ్లు | 'Pakadwa Vivah'bihar,

‘Pakadwa Vivah’ in Bhihar : పాపం బీహార్ కుర్రాళ్లు..! యువకుల్ని కిడ్నాప్ చేసి..తలపై గన్ పెట్టి బలవంతపు పెళ్లిళ్లు

బీహార్ రాష్ట్రంలో పెళ్లికాని కుర్రాళ్లందరూ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు.. ఎవరు వచ్చి కిడ్నాప్ చేస్తారో అని. ఇంతకీ కిడ్నాప్ చేసేది డబ్బుల కోసం కాదు.. పెళ్లి చేయడానికి. బీహార్‌లో మళ్లీ బలవంతపు వివాహాలు ఎక్కువయ్యాయి. యువకుల్ని ఎత్తుకుపోయి మరీ తలపై గన్ పెట్టి బలవంతపు పెళ్లిళ్లు చేస్తున్నారు.

‘Pakadwa Vivah’ in Bhihar : పాపం బీహార్ కుర్రాళ్లు..! యువకుల్ని కిడ్నాప్ చేసి..తలపై గన్ పెట్టి బలవంతపు పెళ్లిళ్లు

‘Pakadwa Vivah’ in Bhihar : బీహార్ రాష్ట్రంలో పెళ్లికాని కుర్రాళ్లందరూ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు.. ఎవరు వచ్చి కిడ్నాప్ చేస్తారో అని. ఇంతకీ కిడ్నాప్ చేసేది డబ్బుల కోసం కాదు.. పెళ్లి చేయడానికి. బీహార్‌లో మళ్లీ బలవంతపు వివాహాలు ఎక్కువయ్యాయి. యువకుల్ని ఎత్తుకుపోయి మరీ తలపై గన్ పెట్టి బలవంతపు పెళ్లిళ్లు చేస్తున్నారు. పిల్ల నచ్చకపోయినా ఏడ్చుకుంటూ.. పిలగాడు పిల్ల మెడలో తాళి కట్టాల్సిందే.

ఇలా బలవంతంగా పెళ్లి చేయడాన్ని బిహార్‌లో ‘పకడ్వా వివాహ్‌’ అని పిలుస్తారు. ఎందుకిలా చేస్తున్నారంటే.. కూతురికి కట్నాలు ఇచ్చి పెళ్లి చేసే స్థోమత లేని తల్లిదండ్రులు.. ఇలా యువకుల్ని ఎత్తుకు వచ్చి బెదిరించి మరీ తాళి కట్టిస్తున్నారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో 18 ఏళ్లకుపైగా వయసున్న అబ్బాయిల్ని ఎత్తుకుపోవడంలో దేశంలోనే బిహార్‌ మొదటి స్థానంలో ఉంది. తాజాగా బెగూసరై జిల్లాలో ఓ వెటర్నరీ డాక్టర్‌ పెళ్లి ఇలాగే జరిగింది. అబ్బాయి మాంచి పొజిషన్‌లో ఉండటంతో.. అతడిపై ఓ అమ్మాయి పేరెంట్స్‌ కన్నేశారు. పశువులకు ఆరోగ్యం బాలేదంటూ ఫోన్‌ చేసి పిలిపించారు. రాగానే పెళ్లి బట్టలు తొడిగారు. బలవంతంగా పెళ్లి చేసేశారు. ఆ డాక్టర్‌ మాత్రం ఈ పెళ్లిని ఒప్పుకోలేదు. అమ్మాయి పేరెంట్స్‌పై పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ చేశాడు.

గతంలో ఓ ఇంజినీర్‌ను ఇలాగే ఎత్తుకెచ్చి పెళ్లి చేయడంతో.. అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. జార్ఖండ్‌కు చెందిన ఇంజినీర్‌ వినోద్‌కుమార్‌ బిహార్‌లోని బొకారో స్టీల్‌ప్లాంట్‌లో పని చేస్తుండగా.. అతడ్ని కొంతమంది ఎత్తుకెళ్లారు. తలకు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ గురిపెట్టి.. బలవంతంగా పెళ్లి చేశారు. వధువు మొహంలో కళ లేదు… ఇక వరుడు చంపేస్తారన్న భయంతో ఎక్కెక్కి ఏడ్చాడు.

ఎక్కెక్కి ఏడుస్తున్న వినోద్‌కుమార్‌ను పక్కనున్న వాళ్లు ఓదార్చారు. నిన్నేం చేయట్లేదు.. నీకు పెళ్లి చేస్తున్నామంటూ ఊరడించారు. కనీసం తనకు వధువు ముఖం కూడా చూపించట్లేదని అతడు కన్నీరు పెట్టుకున్నా పట్టించుకున్న వాళ్లు లేరు.

బిహార్‌లో 1990 నుంచి బలవంతపు పెళ్లిళ్లు మొదలయ్యాయి. 2020లో 7వేల 194 పెళ్లిళ్లు ఇలాగే జరిగాయి. 2019లో అయితే ఏకంగా 10 వేల 925మంది అబ్బాయిల్ని ఎత్తుకెళ్లి వివాహాలు చేశారు. 2018లో 10 వేల 310.. 2017లో 8 వేల 972 పకడ్వా పెళ్లిళ్లు నిర్వహించారు. బెగూసరై, లఖిసరై, ముంగర్‌, మొకామా, జెహానాబాద్‌, గయ జిల్లాలో ఈ పెళ్లిళ్లు ఎక్కువ. కానీ.. చాలామంది బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని. పెళ్లిళ్లు జరిగేటప్పుడు అబ్బాయి తరపు వాళ్లు గొడవలకు వస్తారేమోనని.. అమ్మాయి బంధువులు రెడీగా ఉంటారు. అంటే.. ఎలాంటి సిచ్యుయేషన్‌ ఉందో అర్థమవుతోంది. కొన్నాళ్ల తర్వాత అబ్బాయిని వదిలేస్తారు. కానీ.. వేరే పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తే గొడవ చేస్తారు. దీంతో పకడ్వా పెళ్లిళ్లలో చాలా వరకు రాజీతోనే ముగుస్తాయి.

ఒక్క బిహార్‌లోనే కాదు.. జార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఇలాంటి వివాహాలు కామన్‌. ఈ పని చేయడానికి ఆయా రాష్ట్రాల్లో పెద్ద మాఫియానే నడుస్తోంది. అమ్మాయిల పేరెంట్స్‌తో కాంట్రాక్టులు కుదుర్చుకుని.. అబ్బాయిల్ని ఎత్తుకెళ్లి పెళ్లిళ్లు చేస్తుంటారు. అందుకే కొంచెం అందంగా ఉన్నా.. మంచి చదువు, ఉద్యోగమున్న అబ్బాయిల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఈ కల్చర్‌ను కట్టడి చేయడానికి పోలీసులు ఎంత ట్రై చేస్తున్నా వర్కవుట్‌ కావట్లేదు. దీంతో పెళ్లి కాని యువకులు బయటకు వెళ్లడమే మానేస్తున్నారట.

      ×