Babar Azam Video: వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు లీక్‌పై తొలిసారి స్పందించిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్.. ఏం చెప్పాడంటే?

తాజాగా బాబర్ వ్యక్తిగత వీడియో, ఫొటోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాబర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో తొలిసారిగా బాబర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. జలపాతం పక్కనే కూర్చొని ఉన్న ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు.

Babar Azam Video: వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు లీక్‌పై తొలిసారి స్పందించిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్.. ఏం చెప్పాడంటే?

Bhabar Azam

Babar Azam Video: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ సహచర క్రికెటర్ ప్రేయసికి లైంగిక సందేశాలు పంపించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాబర్ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సహా ఆ సందేశాల తాలూకు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో నువ్వు ఇలాగే నాతో సెక్స్ చాటింగ్ చేస్తుంటే నీ ప్రియుడు జట్టులో నుంచి బయటకు వెళ్లడు అని ఆ యువతికి బాబర్ హామీ ఇచ్చాడనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇవన్నీ మార్ఫింగ్ వీడియోలని, మార్ఫింగ్ ఫొటోలని బాబర్ అభిమానులు పేర్కొంటున్నారు.

Pakistan Cricket Fans: కోహ్లీకి పాక్ అభిమానుల విజ్ఞప్తి .. అలాచేస్తే బాబర్ కంటే ఎక్కువగా ప్రేమిస్తారట ..

గతంలోనూ పాక్ కెప్టెన్ బాబర్‌పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. లాహోర్‌కు చెందిన హమీజా ముఖ్తార్ అనే మహిళ తన ఫిర్యాదులో బాబర్ తన‌పై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడని, అబార్షన్ చేయించుకోమని బలవంతం చేశాడని ఆరోపించింది. పెళ్లిచేసుకుంటానని తప్పుడు వాగ్దానాలు చేశాడని పేర్కొంది. 2014లో జాతీయ క్రికెట్ జట్టులోకి ఎంపికయ్యాడని, అప్పటి నుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆమె వాపోయింది.

 

తాజాగా బాబర్ వ్యక్తిగత వీడియో, ఫొటోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాబర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో తొలిసారిగా బాబర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. జలపాతం పక్కనే కూర్చొని ఉన్న ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. దీనికి క్యాప్షన్.. ’ఆనందంగా ఉండటానికి ఎక్కువ సమయం తీసుకోదు’ అంటూ రాశారు.