Pakistan: పాకిస్థాన్ మ‌రిన్ని క్లిష్ట‌ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది: ప్ర‌ధాని షెహ్‌బాజ్‌

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ మ‌రిన్ని క్లిష్ట ప‌రిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశ ప్ర‌ధాని షెహ్‌బాజ్ ష‌రీఫ్ అన్నారు.

Pakistan: పాకిస్థాన్ మ‌రిన్ని క్లిష్ట‌ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది: ప్ర‌ధాని షెహ్‌బాజ్‌

Pakpm Shehba

Pakistan: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ మ‌రిన్ని క్లిష్ట ప‌రిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశ ప్ర‌ధాని షెహ్‌బాజ్ ష‌రీఫ్ అన్నారు. అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి (ఐఎంఎఫ్‌) నుంచి తిరిగి సాయాన్ని పొందే ప్ర‌క్రియ‌ను పున‌రుద్ధ‌రింప‌జేయ‌డానికి త‌మ ప్ర‌భుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం ఐఎంఎఫ్‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు.

Maharashtra: అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం: ఏక్‌నాథ్‌ షిండే

ఐఎంఎఫ్‌తో ఒప్పందం చేసుకున్న త‌ర్వాత ఓ ఒప్పందం ప్ర‌క్రారం మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ న‌డుచుకుంటే బాగుండేద‌ని ఆయ‌న చెప్పారు. ఒప్పందంలోని అంశాల‌ను నెర‌వేర్చాల్సిందేన‌ని ఐఎంఎఫ్ ఇప్పుడు స్ప‌ష్టం చేసి చెబుతోంద‌ని షెహ్‌బాజ్‌ అన్నారు. దీంతో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నామ‌ని తెలిపారు. అందుకే మ‌రిన్ని క్లిష్ట‌ప‌రిస్థితులూ త‌లెత్తే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నాన‌ని వివ‌రించారు. ఇప్పుడు ఐఎంఎఫ్‌తో మ‌రో ఒప్పందం చేసుకున్న‌ప్ప‌టికీ ఆర్థిక‌ ప‌రిస్థితులేమీ రాత్రికి రాత్రే మారిపోవని చెప్పారు.

Maharashtra: ఇత‌ర రాష్ట్రాల ఎమ్మెల్యేలూ వ‌చ్చి అసోంలో ఉండొచ్చు: సీఎం హిమంత

ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌ప‌ర్చుకోవాల్సి ఉంద‌ని ఆయ‌న అన్నారు. పాక్ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేల‌వుతుండ‌డంతో దాని వ‌ల్ల‌ పేద‌లు ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డానికి ప్ర‌భుత్వం వారికి ఆర్థిక సాయం చేస్తోందని షెహ్‌బాజ్‌ చెప్పారు. పేద కుటుంబాల‌కు నెల‌కు రూ.2,000 అందిస్తోంద‌ని తెలిపారు. కాగా, ఎన్నో చ‌ర్చ‌ల త‌ర్వాత ఐఎంఎఫ్‌ నుంచి తిరిగి సాయాన్ని పొందే ప్ర‌క్రియపై పాక్‌కు ఊర‌ట ల‌భించింది. సాయాన్ని అందించేందుకు ఐఎంఎఫ్ గురువారం అంగీక‌రించింది.