PAN Bank Rules : పాన్ ఉండాల్సిందే.. రూ.20 ల‌క్ష‌ల డిపాజిట్, విత్‌డ్రాకు కొత్త రూల్స్‌..!

PAN Bank Rules : రానురాను ఆర్థిక అవసరాలు పెరిగిపోతున్నాయి. అలాగే ఆర్థికపరమైన లావాదేవీల నిబంధనలు మారుతున్నాయి. బ్యాంకింగ్ లావాదేవీల రూల్స్ మారుతూ వస్తున్నాయి.

PAN Bank Rules : పాన్ ఉండాల్సిందే.. రూ.20 ల‌క్ష‌ల డిపాజిట్, విత్‌డ్రాకు కొత్త రూల్స్‌..!

Pan Mandatory For Cash Deposit Or Withdrawal Of Rs 20 Lakh Or More

PAN Bank Rules : రానురాను ఆర్థిక అవసరాలు పెరిగిపోతున్నాయి. అలాగే ఆర్థికపరమైన లావాదేవీల నిబంధనలు మారుతున్నాయి. బ్యాంకింగ్ లావాదేవీల రూల్స్ మారుతూ వస్తున్నాయి. నగదు నిర్వహణ విషయంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా అంతకంటే ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపితే.. తప్పనిసరిగా పాన్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు లేదా తపాలా ఆఫీసులలో నగదు డిపాజిట్ చేసినా.. విత్ డ్రా చేసినా ఈ కొత్త రూల్స్ వర్తించనున్నాయి. ఆదాయం ప‌న్ను చ‌ట్టం (15వ స‌వ‌ర‌ణ‌) నిబంధ‌న‌లు-2022 కింద కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు (CBDT) ఖ‌రారు చేసింది. ఈ నెల 10వ తేదీన నోటిఫికేష‌న్ సీబీడీటీ జారీ చేయగా.. 2022 మే 26వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి రానున్నాయని సీబీడీటీ వెల్ల‌డించింది.

Pan Mandatory For Cash Deposit Or Withdrawal Of Rs 20 Lakh Or More (1)

Pan Mandatory For Cash Deposit Or Withdrawal Of Rs 20 Lakh Or More 

సాధారణంగా రూ. 50వేల లోపు ఏదైనా లావాదేవీ జరిగితే పాన్ కార్డు అవసరం ఉండకపోవచ్చు. కానీ, రూ.50వేలు ఆపైనా బ్యాంకింగ్ లావాదేవీలు జరిపితే కచ్చితంగా పాన్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక సంవత్సరంలో బ్యాకింగ్ లేదా స‌హ‌కార బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో ఎక్కువ అకౌంట్లలో రూ.20 ల‌క్ష‌లు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఇకపై పాన్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. రూ. 20 లక్షలు లేదా అంత‌కంటే ఎక్కువ విత్ డ్రా చేసినా కూడా పాన్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సిందే..

ఏదైనా ఇతర స‌హ‌కార బ్యాంక్ లేదా పోస్టాఫీసులో కరెంట్ అకౌంట్ లేదా క్యాష్ క్రెడిట్ అకౌంట్ తెరిస్తే.. అప్పుడు కూడా తప్పనిసరిగా పాన్ కార్డు స‌మ‌ర్పించాలి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లలో ఇప్ప‌టికే పాన్‌కార్డు లింక్ చేసినప్పటికీ కూడా రూ.20 లక్షలు ఆపై లావాదేవీలు జరిపినప్పుడు త‌ప్ప‌నిస‌రిగా పాన్ కార్డు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

Read Also : Download e-PAN card Online : మీ పాన్‌కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో ఇలా పొందొచ్చు!