Paneer : బరువు నియంత్రణకు దోహదపడే పన్నీర్

పన్నీర్ పాలనుంచి తయారు అవుతుంది కనుక అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. ప్రొటీన్లతో పాటు అధిక మొత్తంలో కొవ్వులు కూడా ఉంటాయి.

Paneer : బరువు నియంత్రణకు దోహదపడే పన్నీర్

Paneer

Paneer : పాల పదార్థాలలో ఒకటైనా పన్నీర్ తో వివిధ రకాల వంటలను తయారు చేసుకుంటాం. పన్నీర్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల చేకూరతాయి. పన్నీర్ లో అధికమొత్తంలో పోషకాలు ఉంటాయి. త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి పన్నీర్ ఎంతో దోహదపడుతుంది. పనీర్ తినడం వల్ల శరీరానికి పుష్కలంగా ప్రొటీన్ లభిస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ క్రమంలోనే తరుచూ పన్నీరు తినడం ద్వారా మన శరీరానికి తగినన్ని పోషకాలు అందడమే కాకుండా పిల్లల ఎదుగుదలకు, పిల్లల జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి పన్నీర్ ఎంతగానో దోహదపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో పన్నీరు బాగా ఉపకరిస్తుంది.

మన జీర్ణ శక్తి పెరిగేలా చేస్తుంది. పనీర్ తినడం వల్ల దంతాలు, ఎముకలు, స్ట్రాంగ్ గా ఉంటాయి. దంతక్షయం,గుండె జబ్బుల నుండి రక్షణను ఇస్తుంది. షుగర్ రాకుండా అడ్డుకుంటుంది. శరీరం లో బ్లడ్‌‌‌‌‌షుగర్ ప్రమాణాలను సక్రమంగా ఉండేలా చేస్తుంది. పనీర్‌‌‌లో ఉండే ఫొలేట్ పుష్కలం గా ఉండి ఎర్రరక్తకణాలను పెంచుతుంది . ఫోలేట్ బి కాంప్లెక్స్ విటమిన్.ఇది గర్భంలో ఉన్న పిండాభివృద్ధి కి తోడ్పడుతుంది.

పన్నీర్ పాలనుంచి తయారు అవుతుంది కనుక అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. ప్రొటీన్లతో పాటు అధిక మొత్తంలో కొవ్వులు కూడా ఉంటాయి. ఆవుపాలలో కేసిన్ అనే ప్రోటీన్ ఉండటం వల్ల ఆవు పాలతో తయారు చేసిన పన్నీర్ ఉపయోగించడం ఎంతో ఉత్తమం. వీటిలో ప్రొటీన్లు కొవ్వులతోపాటు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. మన శరీరంలో పిండిపదార్థాలను సులభంగా వేరు చేస్తుంది. పన్నీర్ లో క్యాల్షియం అధిక మొత్తంలో ఉండటంవల్ల ఎముకలు దంతాలు దృఢంగా తయారవడానికి పన్నీర్ ఎంతగానో దోహదపడుతుంది.

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి పోషకాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలలో మెదడు పనితీరు జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి, శరీర ఎదుగుదలకు పన్నీర్ ఉపయోగపడుతుంది. పనీర్ ఆహారంలో తీసుకోవడం వలన అది శరీరంలో కొత్త కణాల పుట్టించి,శరీరాన్ని వృద్ధాప్య ఛాయలు నుండి కాపాడుతుంది. ఆడవారి మెనోపాజ్ సమయంలో వచ్చే మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.