Pani Puri : నీచుడు.. పానీపూరి నీటిలో మూత్రం కలిపాడు.. వీడియో వైరల్

పానీపూరి అంటే ఇష్టపడే వారు చాలామందే ఉంటారు. రోడ్డుపక్కన పానీపూరి బండి కనిపిస్తే టేస్ట్ చేయకుండా అస్సలు ఉండలేరు. కొంతమంది రోజూ పానీపూరి తింటే కానీ తృప్తిగా ఫీల్ అవ్వరు. అయితే,

Pani Puri : నీచుడు.. పానీపూరి నీటిలో మూత్రం కలిపాడు.. వీడియో వైరల్

Pani Puri

Pani Puri : పానీపూరి అంటే ఇష్టపడే వారు చాలామందే ఉంటారు. రోడ్డుపక్కన పానీపూరి బండి కనిపిస్తే టేస్ట్ చేయకుండా అస్సలు ఉండలేరు. కొంతమంది రోజూ పానీపూరి తింటే కానీ తృప్తిగా ఫీల్ అవ్వరు. అయితే, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన పానీపూరి తింటే ఆరోగ్యాన్ని రిస్క్ లో వేసుకున్నట్టే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొంతమంది పానీపూరి వికేత్రలు చేసే పనులు చూస్తే జీవితంలో దాని జోలికి వెళ్లరేమో. తాజాగా అసోంలో జరిగిన ఓ ఘటన పానీపూరి ప్రియులను షాక్ కి గురి చేసింది. పానీపూరి అమ్మే ఆ వ్యక్తి నీచానికి ఒడిగట్టాడు. పానీపూరి నీటిలో మూత్రం కలిపి అలాగే అమ్మేశాడు.

పానీపూరి నీటిలో మూత్రం కలిపి అమ్మిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అసోంలో జరిగింది. గుహవాటిలో ఓ వ్యక్తి పానీపూరి నీటిలో మూత్రం కలిపిన వీడియో ఇటీవల వైరల్ గా మారింది. దీంతో అతడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో పోలీసుల వరకు చేరింది. వారు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఆ వ్యక్తిని వెతికి పట్టుకున్నారు. అరెస్ట్ చేసి జైల్లో వేశారు.

ఆ వ్యక్తి చేసిన పని అందరిని షాక్ కి గురి చేసింది. ఈ ఘటన తర్వాత రోడ్డు పక్కన అమ్మే పానీపూరి తినడంపై ఒకసారి ఆలోచించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.