Papaya : చర్మంపై ముడతలు తొలగించుకోవాలంటే బొప్పాయితో!
బొప్పాయిలో ఉండే ఎంజైమ్ జుట్టు కుదుళ్లను బలహీనం చేస్తుంది. ఫలితంగా అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి. బొప్పాయిలో ఉన్న ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్స్ వయసు పైబడటం వల్ల వచ్చే లక్షణాలను అడ్డుకుంటాయి. కళ్ల కింద ముడతలు తొలగిపోతాయి.

Papaya : చర్మసౌందర్యాన్ని కాపాడుకోవడానికి, నిగారింపును పెంచుకోవడానికి బొప్పాయి బాగా తోడ్పడుతుంది. బొప్పాయి ఫేస్‌ప్యాక్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. వయసు పైబడటం వల్ల వచ్చే ఛాయలను దూరం చేస్తుంది. ముడతలు తగ్గిపోతాయి. ముఖంలో తాజాదనం వస్తుంది. బొప్పాయిలో ఉండే ఎంజైమ్ జుట్టు కుదుళ్లను బలహీనం చేస్తుంది. ఫలితంగా అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి. బొప్పాయిలో ఉన్న ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్స్ వయసు పైబడటం వల్ల వచ్చే లక్షణాలను అడ్డుకుంటాయి. కళ్ల కింద ముడతలు తొలగిపోతాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ, సి చర్మానికి పునరుజ్జీవాన్నిస్తుంది. బొప్పాయిలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
ఫేస్ ప్యాక్ తయారీ కోసం;
అరకప్పు బొప్పాయి ముక్కలను తీసుకుని గుజ్జుగా చేసి ఒక టేబుల్‌స్పూన్ పాలు, తేను కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు రాసుకుని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు సార్లు ఈ ఫేస్‌ప్యాక్ ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మొటిమల సమస్య ఉన్న వారు బొప్పాయి, తేనె, పాలతో పాటు కొద్దిగా నిమ్మరసం, గంధం కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
బొప్పాయి పేస్టులో కోడిగుడ్డు తెల్లసొన కలిపి అప్లై చేసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది. అలాగే ఆయిల్ స్కిన్ ఉన్న వారైతే బొప్పాయి ముక్కలతో పాటు కొన్ని ఆరెంజ్ ముక్కలు వేసి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై ముడతలు తొలగిపోవటంతోపాటు, చర్మం కాంతి వంతంగా మారుతుంది.