Parking Lot: బీజేపీ సభ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు

మోదీ సభ కోసం తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు సికింద్రాబాద్ తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. స్థానిక జింఖానా గ్రౌండ్స్‌లో వీఐపీ పార్కింగ్ ఏర్పాటు చేశారు.

Parking Lot: బీజేపీ సభ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు

Parking Lot: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ రోజు మోదీ బహిరంగ సభ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభ కోసం తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు సికింద్రాబాద్ తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. స్థానిక జింఖానా గ్రౌండ్స్‌లో వీఐపీ పార్కింగ్ ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌ సభా స్థలి వద్ద వీవీఐపీల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. శామీర్‌పేట్, సిద్ధిపేట్, కరీంనగర్ నుంచి వచ్చే వారికి దోబీఘాట్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశారు.

Mexico Mayor: మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్.. ఎందుకో తెలుసా!

నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నుంచి సుచిత్ర, బాలానగర్ మీదుగా వచ్చే వారికి పోలో గ్రౌండ్స్‌లో, వరంగల్, నల్గొండ, ఉప్పల్ నుంచి వచ్చే వారికి రైల్ నిలయంలో, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ట్యాంక్ బండ్ వైపు నుంచి వచ్చే వారికి నెక్లెస్ రోడ్డులో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు నగరంలో బీజేపీ సభ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. సభకు వచ్చే వారు పార్కింగ్ ఏర్పాట్లను గుర్తించి, అందుకు అనుగుణంగా తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని ట్రాఫిక్ అధికారులు సూచిస్తున్నారు.