Arpita Mukherjee: అర్పిత కోసం లగ్జరీ కార్లు బుక్ చేసిన పార్థా ఛటర్జీ

బెంగాల్ స్కాంలో ఇరుక్కున్న మాజీ మంత్రి పార్థా ఛటర్జీ.. తన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి రెండు లగ్జరీ కార్లు బుక్ చేశాడు. ఆమెకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. అయితే, ఆలోపే ఇద్దరినీ ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

Arpita Mukherjee: అర్పిత కోసం లగ్జరీ కార్లు బుక్ చేసిన పార్థా ఛటర్జీ

Arpita Mukherjee

Arpita Mukherjee: పశ్చిమ బెంగాల్‌, టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కాంలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ఇంట్లో ఈడీ అధికారులు దాదాపు రూ.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అర్పితకు చెందిన రెండు లగ్జరీ కార్లు మిస్సయ్యాయి.

Narendra Modi: జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోండి: ప్రధాని మోదీ

కో‌ల్‌కతాలో అర్పిత నివాసం ఉంటున్న డైమండ్ సిటీ కాంప్లెక్స్ నుంచి ఈ కార్లు ఎక్కడికో వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. వాటిలో భారీగా నగదు, ఇతర డాక్యుమెంట్లను తరలించి ఉండొచ్చని ఈడీ అనుమానిస్తోంది. మరోవైపు వీరిద్దరి అరెస్టుకు ముందే అర్పిత కోసం పార్థా ఛటర్జీ రెండు లగ్జరీ కార్లు బుక్ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. వీటికి డొల్ల కంపెనీల నుంచి పేమెంట్లు కూడా జరిగిపోయాయని అధికారులు తెలిపారు. త్వరలోనే వీటి డెలివరీ ఇవ్వాల్సి ఉంది. అయితే, ఆలోపే ఇద్దరినీ అధికారులు అరెస్టు చేశారు. గతంలో కూడా అర్పితకు పార్థా ఛటర్జీ కార్లు బహుమతిగా ఇచ్చాడు. ఒక మెర్సిడెస్ కారుతోపాటు, మరో మినీ కూపర్ కారును అర్పితకు ఇచ్చాడు.

Gujarat: ఎనిమిదో తరగతి బాలుడిపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు.. అరెస్టు

ఈ రెండు కార్లలోనే ఇద్దరు షికార్లు చేసేవారు. వాటిని అర్పిత పార్టీలకు వెళ్లేందుకు కూడా వాడేది. కాగా, కేసు విచారణ కొనసాగుతోంది. మరింతమందిని అధికారులు విచారిస్తున్నారు. పార్థా ఛటర్జీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గం నుంచి తొలగించడంతోపాటు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అర్పిత, పార్థా ముఖర్జీ ఇద్దరూ ఈడీ అదుపులో ఉన్నారు.