Citizen Perception Survey: ఆన్‌లైన్ సిటిజన్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొనండి.. నగరవాసులను కోరిన జీహెచ్ఎంసీ

గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ సిటిజన్ పర్సెప్షన్ సర్వేలో నగర ప్రజలు చురుగ్గా పాల్గొనాలని జీహెచ్ఎంసీ గురువారం కోరింది. తద్వారా హైదరాబాద్‌ను దేశంలోని 264 నగరాల్లో అగ్రస్థానంలో నిలపాలని సూచించింది.

Citizen Perception Survey: ఆన్‌లైన్ సిటిజన్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొనండి.. నగరవాసులను కోరిన జీహెచ్ఎంసీ

GHMC

Citizen Perception Survey: గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ సిటిజన్ పర్సెప్షన్ సర్వేలో నగర ప్రజలు చురుగ్గా పాల్గొనాలని జీహెచ్ఎంసీ గురువారం కోరింది. తద్వారా హైదరాబాద్‌ను దేశంలోని 264 నగరాల్లో అగ్రస్థానంలో నిలపాలని సూచించింది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈ సర్వేలో నగరాల్లో జీవన ప్రమాణాలు, ఆర్థిక సామర్థ్యం వంటి పలు విభాగాలపై ప్రజలు అభిప్రాయాలను తెలుసుకుంటారని గురువారం జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్: కాకినాడకు మాత్రమే చోటు..

తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో సహా ఎనిమిది విభిన్న భాషల్లో ఈ సర్వే అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌పై సానుకూల స్పందన ద్వారా ఇతర భారతీయ నగరాలతో పోల్చినప్పుడు నగరాన్ని అగ్రస్థానంలో ఉంచడంలో చాలా దోహదపడుతుందని జీహెచ్ఎంసీ తెలిపింది. నగరంలో నివాసయోగ్యతను కొలవడానికి ఉద్దేశించిన మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలకు సంబంధించిన 17 విభిన్న పారామితులపై పౌరులు తమ అభిప్రాయాన్ని నమోదు చేసుకోవాలని జీహెచ్ఎంసీ తెలిపింది.

Pakistan PM Shehbaz Sharif: ఇండియా ఓటమిపై పాక్ ప్రధాని ఆసక్తికర ట్వీట్.. గట్టి కౌంటర్ ఇచ్చిన టీమిండియా ఫ్యాన్స్..

ఈ ఏడాది సిటిజన్ పర్సెప్షన్ సర్వే – 2022 నవంబర్ 9 నుండి డిసెంబర్ 23 వరకు నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతోంది. భారతదేశం అంతటా 21 లక్షల కంటే ఎక్కువ మంది పౌరుల అభిప్రాయాలను సేకరించేందుకు, 2022 సర్వే 264 నగరాల్లో నిర్వహించబడుతుంది.