Paruchuri Gopalakrishna : చిరంజీవికి ఆ క్యారెక్టర్ అస్సలు సెట్ అవ్వలేదు.. కానీ.. గాడ్ ఫాదర్ పై పరుచూరి వ్యాఖ్యలు..

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..'' ఈ సినిమా మలయాళం వర్షన్ కంటే కూడా తెలుగు వర్షన్ బాగుంది. స్క్రీన్ ప్లే ఇందులో చాలా బాగుంది. కానీ చిరంజీవికి ఈ స్టోరీ అస్సలు సెట్ అవ్వదు. చిరంజీవి అంటే మాస్ మషాలా సినిమాలు ఆశిస్తారు అభిమానులు. కానీ..............

Paruchuri Gopalakrishna : చిరంజీవికి ఆ క్యారెక్టర్ అస్సలు సెట్ అవ్వలేదు.. కానీ.. గాడ్ ఫాదర్ పై పరుచూరి వ్యాఖ్యలు..

Paruchuri Gopalakrishna :  చిరంజీవి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత గతంలో లాగా ఆయన రేంజ్ కి తగ్గ సినిమాలు రావట్లేదని అభిమానులు బాధపడుతున్నారు. కానీ ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో వచ్చి ప్రేక్షకులని, అభిమానులని మెప్పించారు. అసలు చిరంజీవి సినిమా అంటేనే మాస్, ఫైట్స్, డైలాగ్స్, డ్యాన్స్ ఉండాలి. కానీ అవేమి లేకుండానే గాడ్ ఫాదర్ సినిమాతో భారీ విజయం సాధించారు. మలయాళ సినిమా లూసిఫర్ కి రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కింది. అయినా మలయాళ సినిమాని మరిపించి మరీ మంచి విజయం సాధించింది. చాలా మంది మలయాళ సినిమా కంటే కూడా ఇదే బాగుందని అన్నారు కూడా.

తాజాగా గాడ్ ఫాదర్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన పరుచూరి పలుకులు పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ అందులో సినిమాలని విశ్లేషిస్తూ మాట్లాడతారు. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా గురించి మాట్లాడారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..” ఈ సినిమా మలయాళం వర్షన్ కంటే కూడా తెలుగు వర్షన్ బాగుంది. స్క్రీన్ ప్లే ఇందులో చాలా బాగుంది. కానీ చిరంజీవికి ఈ స్టోరీ అస్సలు సెట్ అవ్వదు. చిరంజీవి అంటే మాస్ మషాలా సినిమాలు ఆశిస్తారు అభిమానులు. కానీ ఒక స్లో నేరేషన్ ఉన్న సినిమాలో చిరంజీవి చేసి హిట్ కొట్టడం గొప్ప విషయం. చిరంజీవికి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు కూడా చేశారు. కానీ సినిమా చూసిన తర్వాత హిట్ అయినా కూడా చాలా మంది చిరు డ్యాన్స్ లేదని ఫీల్ అయ్యారు. చివర్లో ఏదో ఫార్మాలిటీగా ఆ పాటని అభిమానుల కోసం పెట్టి ఉంటారు” అని అన్నారు.

Vishnu Vishal : తమిళ్ వాళ్ళు అలా మాట్లాడారు.. కానీ రవితేజ అయితే.. టాలీవుడ్ ని పొగిడిన తమిళ్ హీరో..

”ఇక ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ ని మార్కెట్ కోసం తీసుకున్నారు. కానీ చిరంజీవి ఉండి సల్మాన్ ఫైట్స్ చేస్తే చిరు అభిమానులు ఫీల్ అయ్యారు. చిరంజీవి ఫైట్స్ ఎలా ఉంటాయో మనకి తెలిసిందే. ఆ మాస్ ఫైట్స్ మిస్ అయ్యారు. ఒక్క ఫైట్ మాత్రం బాగుంది. అలాగే డైలాగ్స్ కొన్నే ఉన్నాయి. చిరు డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయని మనకి తెలుసు. ఈ సినిమాలో అలాంటి డైలాగ్స్ కొన్నే ఉన్నాయి. మరిన్ని డైలాగ్స్ ఉంటే ఇంకా బాగుండేదేమో” అని గాడ్ ఫాదర్ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలిపారు పరుచూరి గోపాలకృష్ణ.