Indian Railways: రైల్లో క‌ప్పు కాఫీకి రూ.70 చెల్లించిన ప్ర‌యాణికుడు

సాధార‌ణంగా రైళ్ళ‌లో క‌ప్పు కాఫీ రూ.15 లేదా రూ.20 ఉంటుంది? అయితే, ఈ నెల 28న ఓ ప్ర‌యాణికుడు భోపాల్ శ‌తాబ్ది ట్రైన్‌లో ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తూ క‌ప్పు కాఫీకి ఆర్డ‌ర్ ఇచ్చి తెప్పించుకోగా, దానికి బిల్లు రూ.70 వేశారు. దీంతో అత‌డు షాక్ అయ్యాడు. ఆ బిల్లుపై రైల్వే శాఖ వివరణ ఇచ్చింది.

Indian Railways: రైల్లో క‌ప్పు కాఫీకి రూ.70 చెల్లించిన ప్ర‌యాణికుడు

Bill

Indian Railways: సాధార‌ణంగా రైళ్ళ‌లో క‌ప్పు కాఫీ రూ.15 లేదా రూ.20 ఉంటుంది? అయితే, ఈ నెల 28న ఓ ప్ర‌యాణికుడు భోపాల్ శ‌తాబ్ది ట్రైన్‌లో ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తూ క‌ప్పు కాఫీకి ఆర్డ‌ర్ ఇచ్చి తెప్పించుకోగా, దానికి బిల్లు రూ.70 వేశారు. దీంతో అత‌డు షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసి, క‌ప్పు కాఫీ రూ.20 కాగా, దానికి జీఎస్టీ రూ.50 వేశార‌ని చెప్పాడు. మొత్తానికి క‌ప్పు కాఫీకి రూ.70 బిల్లు వేశార‌ని తెలిపాడు.

Maharashtra: డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఫ‌డ్న‌వీస్‌పై మోదీ ప్ర‌శంస‌ల జ‌ల్లు

అయితే, అత‌డు చూపిన బిల్లులో కాఫీకి రూ.20 అని, స‌ర్వీసు ఛార్జి రూ.50 అని ఉంది. అత‌డు క‌ట్టింది జీఎస్టీ కాద‌ని, స‌ర్వీసు ఛార్జి క‌ట్టాడ‌ని నెటిజ‌న్లు ఎత్తి చూపారు. అయిన‌ప్ప‌టికీ, రూ.20 కాఫీకి రూ.50 స‌ర్వీసు ఛార్జి వేయ‌డం ఏంట‌ని రైల్వేపై విమ‌ర్శ‌లు కురిపించారు. దీనిపై స్పందించిన రైల్వే వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. నిబంధనల ప్రకారమే బిల్ వేశామని, ఆ ప్ర‌యాణికుడి నుంచి అద‌నంగా ఎలాంటి ఛార్జీనీ వ‌సూలు చేయ‌లేద‌ని పేర్కొంది.

New Project (22)

Maharashtra: మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్ర‌మాణం.. డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్

భార‌త రైల్వే 2018లో విడుద‌ల చేసిన ఉత్వ‌ర్తుల ప్ర‌కారం.. రాజ‌ధాని లేదా శ‌తాబ్ది వంటి రైళ్ళ కోసం రిజ‌ర్వేష‌న్ చేసుకునే స‌మ‌యంలోనే ప్ర‌యాణికుడు ఆహారాన్ని బుక్ చేసుకోవాల‌ని పేర్కొంది. ఒక‌వేళ ఆహారాన్ని బుక్ చేసుకోకుండా ప్ర‌యాణిస్తోన్న స‌మ‌యంలో ఆర్డ‌ర్ ఇస్తే ఆ ఆహార ప‌దార్థానికి అద‌నంగా రూ.50 స‌ర్వీస్ చార్జి చెల్లించాల్సి ఉంటుంద‌ని తెలిపింది. క‌ప్పు టీ ఆర్డ‌ర్ ఇచ్చినా రూ.50 స‌ర్వీస్ చార్జి చెల్లించాల్సిందేన‌ని వివ‌రించింది.