CM Kejriwal : స్టెరాయిడ్లు, షుగర్ తోనే బ్లాక్ ఫంగ‌స్ ముప్పు..కేజ్రీవాల్

ఢిల్లీలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టెరాయిడ్ మందుల‌ను నిర్ధిష్ట ప‌రిమితిలో వాడాల‌ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వివిధ హాస్పిటల్స్,డాక్టర్లకు గురువారం విజ్ఞ‌ప్తి చేశారు.

CM Kejriwal : స్టెరాయిడ్లు, షుగర్ తోనే బ్లాక్ ఫంగ‌స్ ముప్పు..కేజ్రీవాల్

Cm Kejriwal

CM Kejriwal ఢిల్లీలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టెరాయిడ్ మందుల‌ను నిర్ధిష్ట ప‌రిమితిలో వాడాల‌ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వివిధ హాస్పిటల్స్,డాక్టర్లకు గురువారం విజ్ఞ‌ప్తి చేశారు. మోతాదు మించి స్టెరాయిడ్ ల వాడ‌కం, డ‌యాబెటిస్ బ్లాక్ ఫంగ‌స్ కు దారితీస్తున్నాయ‌ని అన్నారు. రోగులు త‌మ షుగ‌ర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవాల‌ని కేజ్రీవాల్ కోరారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్ల కోసం 3 ప్రభుత్వ ఆసుపత్రులలో ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

ఢిల్లీలో రోగులకు తగిన సంఖ్యలో మందులు, ఇంజెక్షన్లు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ కోరారు. కేంద్రం మాకు తగినంత సంఖ్యలో ఇంజెక్షన్లను(బ్లాక్ ఫంగస్ చికిత్స‌ కోసం)అందిస్తుందని మేము ఆశిస్తున్నాము. నిబంధనల ప్రకారం బాధిత రోగులకు ఇంజెక్షన్లు ఇచ్చే వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసాము. బుధవారం వారికి ఇంజెక్షన్లకు సంబంధించి వివిధ ఆసుపత్రుల నుండి 84 దరఖాస్తులు వచ్చాయి అని కేజ్రీవాల్ ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి స‌త్యేంద‌ర్ జైన్, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య్ కుమార్ దేవ్ ల‌తో అత్యున్నత భేటీ అనంత‌రం కేజ్రీవాల్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు.