క‌రోనాతో ఉపాధి పోయింది..కుటుంబం కోసం యువ‌కుడు ప్రాణ‌త్యాగం

  • Published By: madhu ,Published On : June 16, 2020 / 12:59 AM IST
క‌రోనాతో ఉపాధి పోయింది..కుటుంబం కోసం యువ‌కుడు ప్రాణ‌త్యాగం

అవును నిజం..క‌రోనాతో విధించిన లాక్ డౌన్ తో ఉపాధి పోయింది. త‌న ఇంట్లో ఉన్న వారు ఆక‌లితో అల‌మ‌టిస్తుంటే త‌ట్టుకోలేక‌పోయాడు. ఉపాధి కోల్పోయి ఇంటికే ప‌రిమిత‌మ‌య్యాడు. తిన‌డానికి ఏం లేదు. కానీ ఏం చేయాలి ? త‌న కుటుంబాన్ని ఆదుకోవాల‌ని అనుకున్నాడు. అనుకున్న‌దే త‌డువుగా ఓ ఆలోచ‌న వ‌చ్చింది. తాను కోరుకున్న‌ట్లుగానే..ఇంటికి ఆహార ప‌దార్థాలు వ‌చ్చాయి. ఇంకేం..అత‌ని కొంచెం అయినా..క‌ష్టాలు తీరాయి..అనుకుంటున్నారా..కానీ తిన‌డానికి అత‌ను లేడు. ఎందుకంటే..అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

తాను చ‌నిపోతే..ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని అనుకుని దారుణ ఘ‌ట‌న‌కు పూనుకున్నాడు. ప్ర‌భుత్వాధికారులు ఇచ్చిన 25 కిలోల గోధుమ‌లు, బియ్యం ఏం చేసుకోవాల‌ని కుటుంబ‌స‌భ్యులు ప్ర‌శ్నిస్తున్నారు. క‌రోనాతో రాకాసి ఎన్నో కుటుంబాల్లో తీర‌ని విషాదాన్ని నింపుతోంది. ఈ విషాద ఘ‌ట‌న పాట్నాలో చోటు చేసుకుంది. 

షాపూర్ కు చెందిన 25 సంవ‌త్స‌రాలున్న లోన్ తీసుకుని ఆటో కొనుగోలు చేశాడు. వ‌చ్చిన డ‌బ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే..క‌రోనా వైర‌స్ భార‌త‌దేశాన్ని కూడా చుట్టేసింది. ఫ‌లితంగా కేంద్రం లాక్ డౌన్ విధించింది. అత‌నికి ఉపాధి పోయింది. ఎక్క‌డిక‌క్క‌డ ర‌వాణా నిలిచిపోవ‌డంతో ఆటో న‌డ‌ప‌డం క‌ష్ట‌మైపోయింది. కుటుంబ చాలా క‌ష్టాలు ప‌డింది. ప్ర‌భుత్వం ఇచ్చే నిత్యావ‌స‌ర స‌రుకులు పొందేందుకు ఉండే రేష‌న్ కార్డు లేదు. 

తాను చ‌నిపోతే..కుటుంబ‌స‌భ్యుల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని భావించాడు. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌మ‌కు క‌నీసం రేష‌న్ కార్డు కేటాయించాలేద‌ని కుటుంబం వాపోయింది. పాట్నా డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ కుమార్ ర‌వి, అధికారులు అత‌ని ఇంటికి చేరుకున్నారు. 25 కిలోల బియ్యం, గోధుమ‌లు ఇచ్చారు. 

ఈ ఘ‌ట‌న‌పై పార్టీలు భ‌గ్గుమ‌న్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగం ఎలా ఉందో ఈ ఘ‌ట‌న చూపెడుతోంద‌ని, ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించాయి. కొడుకు మృతితో ఆదాయం కోల్పోయిన త‌మ కుటుంబాన్ని ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాల‌ని మృతుడి తండ్రి కోరుతున్నాడు. నిరుద్యోగ స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వ వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ వెల్ల‌డించారు.