Pawan Kalyan : ‘ఈసారి మాములుగా ఉండదు మరి.. పూనకాలే’..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక రెడీ చేస్తున్నారు.. వచ్చే సంక్రాంతికి పవన్, ‘భీమ్లా నాయక్’ గా బాక్సాఫీస్ రిపోర్టింగ్ ఇవ్వబోతున్నారు..

Pawan Kalyan : ‘ఈసారి మాములుగా ఉండదు మరి.. పూనకాలే’..

Pspk

Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక రెడీ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి పవన్, ‘భీమ్లా నాయక్’ గా బాక్సాఫీస్ రిపోర్టింగ్ ఇవ్వబోతున్నారు.. పవన్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో మలయాళీ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగులో రీమేక్‌ అవుతోంది. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌‌‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. సాగర్.కె.చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ గా పవర్‌స్టార్..

ఇటీవల విడుదల చేసిన పవర్ స్టార్ ఫస్ట్ లుక్, మేకింగ్ గ్లింప్స్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు పవన్ కళ్యాణ్. టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తున్నారు.

Making Glimpse : పవన్ – రానా.. ఎవరూ తగ్గట్లేదుగా..

ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 15వ తేది ఉదయం 9:45 గంటలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చెయ్యబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ లుంగీతో ఉన్న పిక్ వదిలారు మేకర్స్. సోషల్ మీడియాలో పవన్ న్యూ పోస్టర్ చక్కర్లు కొడుతోంది. ‘ఈసారి మాములుగా ఉండదు మరి, పూనకాలే’.. అంటూ నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది. ఈ మూవీకి ఎలాంటి పవర్‌ఫుల్ టైటిల్ పెడతారు.. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్ పవన్ నోట వస్తే ఎలా ఉంటుంది..? అని ఈగర్‌‌గా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్..