Pawan Kalyan : మళ్లీ థియేటర్లలో ‘వకీల్ సాబ్’..!

ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ రిలాక్సేషన్ ఇవ్వడంతో పాటు థియేటర్లు ఓపెన్ చెయ్యడానికి ప్లాన్ చెయ్యడంతో ‘వకీల్ సాబ్’ ని మళ్లీ 300 థియేటర్లలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..

Pawan Kalyan : మళ్లీ థియేటర్లలో ‘వకీల్ సాబ్’..!

Vakeel Saab

Pawan Kalyan: క్లాసీ డైరెక్టర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన స్టార్స్, మళ్లీ థియేటర్లోకొస్తున్న ‘వకీల్ సాబ్’, సిక్స్ ప్యాక్ మస్క్యులర్ బాడీతో శౌర్య, నెక్ట్స్ మంత్ రిలీజ్‌కు రెడీ అవుతున్న నాని.. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్‌తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్ డేట్స్ బ్రీఫ్‌గా చూద్దాం.

సోల్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ బర్త్‌డే సందర్భంగా విషెస్అందించారు స్టార్లు. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి – చరణ్‌తో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో మరో సినిమాని తెరకెక్కించడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు కొరటాల.

ఏప్రిల్‌‌లో రిలీజ్ అయిన ‘వకీల్ సాబ్’ సినిమా.. సరిగా థియేటర్లో ఆడకుండానే లాక్‌డౌన్ బ్రేక్ వేసేసింది. ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ రిలాక్సేషన్ ఇవ్వడంతో పాటు థియేటర్లు ఓపెన్ చెయ్యడానికి ప్లాన్ చెయ్యడంతో ‘వకీల్ సాబ్’ ని మళ్లీ 300 థియేటర్లలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సక్సెస్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు యంగ్ హీరో నాగశౌర్య. తన అప్‌కమింగ్ ఆర్చరీ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘లక్ష్య’ సినిమా కోసం ఫుల్ మస్కులర్ బాడీతో మేకోవర్ అయిన పిక్ పోస్ట్ చేశారు నాగశౌర్య.

వరుస సినిమాలను లైన్లో పెట్టిన నాని.. రిలీజ్ పోస్ట్‌పోన్ అయిన సినిమాని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. శివ నిర్వాణ డైరెక్షన్‌లో నాని చేస్తున్న ‘టక్ జగదీష్’ సినిమాని నెక్ట్స్ మంత్ థియేటర్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు నాని.