PawanKalyan: తుపాన్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్
అసని తుపాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కోస్తా జిల్లాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని, ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర ప్రభావం ఉంటుందని ఆయన హెచ్చరించారు.

PawanKalyan: అసని తుపాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కోస్తా జిల్లాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని, ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర ప్రభావం ఉంటుందని ఆయన హెచ్చరించారు. అసని తుపాను ప్రభావానికి గురయ్యే ప్రజలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు. అసని తుపాను గురంచి బుధవారం ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ స్పందించారు.
Asani Cyclone: అసని ఎఫెక్ట్.. 37రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ
‘‘వరి పంట కోత కోసే సమయంలో ఈ విపత్తు రావడం దురదృష్టకరం. అనేక గ్రామాల్లో ఇంకా కళ్లాల్లోనే ధాన్యం ఉంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలి. ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించాలి. ముఖ్యంగా 17 శాతం మించి తేమ ఉండకూడదు అనే నిబంధన ఈ సమయంలో వర్తింపచేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలి. అసని ప్రభావం వల్ల పండ్ల తోటలు, ఉద్యాన పంటలు వేసిన రైతులు కూడా దెబ్బ తిన్నారు. పంట నష్ట పరిహారాన్ని తక్షణమే లెక్కించి వాస్తవ నష్టానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలి. తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ళు దెబ్బ తిన్నవారిని ఆదుకోవాలి. జనసైనికులు, పార్టీ నాయకులు బాధితులకు బాసటగా నిలవాలి’’ అని పవన్ పేర్కొన్నారు.
- Andhra pradesh : వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి మృతదేహం కలకలం.. కాకినాడలో టెన్షన్ టెన్షన్
- YCP Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్
- Strange Tradition : ఆ ఊరిలో వింత సంప్రదాయం..ఒకరికొకరు తాళి కట్టుకునే వధూవరులు
- Gautam Adani: రాజ్యసభ సీటు వార్తలపై అదానీ క్లారిటీ
- chicken prices: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు
1R. krishnaiah: సామాజిక న్యాయంలో జగనే నెంబర్ వన్: ఆర్ కృష్ణయ్య
2Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
3KCR With Deve Gowda : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారు- దేవెగౌడతో భేటీ తర్వాత కేసీఆర్
4Secunderabad: రైల్వే స్టేషన్ వద్ద “ఐ లవ్ సికింద్రాబాద్” ఏర్పాటు
5Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
6BJP: మోదీ సభకు పోలీసుల ఆటంకాలు.. బీజేపీ నేతల ఆగ్రహం
7Minister Gangula Counter : ఆ కుటుంబం ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ప్రధాని వ్యాఖ్యలకు గంగుల కౌంటర్
8Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
9NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
10Haridwar Superfast Express : 20 నిమిషాలు ముందే చేరుకున్న రైలు..బోగీలోంచి దిగి ప్లాట్ఫామ్ ప్రయాణీకులు డ్యాన్స్
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
-
Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు
-
Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
-
Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్డేట్