Brahmamgari Matham: చట్టం ప్రకారమే పీఠాధిపతి వివాద పరిష్కారం: మంత్రి వెల్లంపల్లి

చట్టం ప్రకారమే బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదాన్ని పరిష్కరిస్తామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. మఠం పీఠాధిపతి, వారసత్వం అంశంపై తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ.. బ్రహ్మంగారు 1693లో సమాధి కాగా.. 8.5.2021న వీర భోగి‌వసంతరాయులు కోవిడ్ తో మరణించారు.

Brahmamgari Matham: చట్టం ప్రకారమే పీఠాధిపతి వివాద పరిష్కారం: మంత్రి వెల్లంపల్లి

Brahmamgari Matham

Brahmamgari Matham : చట్టం ప్రకారమే బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదాన్ని పరిష్కరిస్తామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. మఠం పీఠాధిపతి, వారసత్వం అంశంపై తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ.. బ్రహ్మంగారు 1693లో సమాధి కాగా.. 8.5.2021న వీర భోగి‌వసంతరాయులు కోవిడ్ తో మరణించారు. ఆయనకి ఇద్దరు భార్యలు ఉండగా… వారి సంతానం మఠాధిపత్యం కోరుతున్నారు. దీనికి సంబంధించిన ‌వీలునామాలు దేవాదాయశాఖకు అందలేదు.

సెక్షన్ 54 ప్రకారం‌ వీలునామా రాసిన 90 రోజుల్లో ధార్మిక పరిషత్ కు పంపాల్సి ఉండగా.. సెక్షన్ 54 (1)ప్రకారం వీలునామా అందకపోవడం వల్ల .. సెక్షన్54 (2)ప్రకారం ధార్మిక పరిషత్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ముప్పై రోజుల ముందు నోటీసులు ఇచ్చి… అందరితో చర్చిస్తామని.. కడప అసిస్టెంట్ కమిషనర్ ను మఠం పర్యవేక్షణ కోసం క్విక్ పర్సన్ గా నియమించామని తెలిపారు. మఠంలో పరిస్థితి తెలుసుకునేందుకు సీనియర్ అధికారిని నియమిస్తున్నామని.. ఈ రిపోర్ట్, మఠాధిపతులు ఇచ్చే నివేదికలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

బ్రహ్మం గారి మఠం వివాదం పై అనేక మంది మమ్మలను కలిసి వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేశారని.. దేశంలో ఏం జరుగుతుందో కాలజ్ఞానం ద్వారా బ్రహ్మం గారు వివరించారని.. అంతటి గొప్ప మఠం పై అనవసర వివాదాలు చేయవద్దని కోరుతున్నామన్నారు. బ్రహ్మంగారి కుటుంబంలో వచ్చిన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని.. విద్వేషాలు రెచ్చగొట్టకుండా అందరూ సమన్వయంతో ఉండాలని కోరారు. మఠాధిపత్యం విషయంలో చట్ట ప్రకారం ముందుకెళుతున్నాం… మఠం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది కనుక ఎటువంటి అభిప్రాయాలున్నా కమిటీకి, సీనియర్ అధికారులకి చెప్పవచ్చని తెలిపారు.

ఎవరూ ఆందోళన చెందవద్దు.. మంచి జరిగేలా దేవాదాయశాఖ నిర్ణయం ఉంటుందన్నారు. 128 మఠాలు దేవాదాయశాఖలో రిజిస్టర్ అయ్యాయని.. అందులోని సభ్యలతో ఒక కమిటీని వేసి ముప్పై రోజుల సమయం ఇస్తామని.. అందరి నివేదికలను పరిశీలించి మంచి నిర్ణయంతో వివాదానికి ఫుల్ స్టాప్ పెడతామన్నారు. మొత్తం 90ఎకరాల వరకు బ్రహ్మం గారి మఠానికి ఉన్నట్లు గుర్తించగా.. అందులో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా… బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట ప్రకారం మేము వెళుతున్నాం… కోర్టుకు వెళితే… న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తామన్నారు. కాగా.. సాయంత్రం నాలుగు గంటలకు పీఠాధిపతి అంశంపై శివ స్వామీ బృందం ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.