Pending Challan: పెండింగ్ చలాన్ వెహికల్స్‌కు గుడ్‌న్యూస్.. టూ వీలర్స్‌కు 75% డిస్కౌంట్

చిన్న పొరబాటు జీవితాలనే చిదిమేస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించి గమ్యస్థానాన్ని క్షేమంగా చేరుకోవచ్చంటూ ఎంత చెప్పినా ఖాతరు చేయని వారికి ఫైన్ వేసి గుర్తు చేస్తుంది ట్రాఫిక్ పోలీస్ శాఖ.

Pending Challan: పెండింగ్ చలాన్ వెహికల్స్‌కు గుడ్‌న్యూస్.. టూ వీలర్స్‌కు 75% డిస్కౌంట్
ad

Pending Challan: చిన్న పొరబాటు జీవితాలనే చిదిమేస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించి గమ్యస్థానాన్ని క్షేమంగా చేరుకోవచ్చంటూ ఎంత చెప్పినా ఖాతరు చేయని వారికి ఫైన్ వేసి గుర్తు చేస్తుంది ట్రాఫిక్ పోలీస్ శాఖ. చేసిన తప్పులతో పాటు ఫైన్లు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. కొన్నిసార్లు ఆ చలానాలు కట్టలేక వాహనాలను వదిలేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు పెండింగ్ చలానాలు ఉన్నవాళ్లకి ట్రాఫిక్ పోలీస్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు పోలీస్ శాఖ అధికారులు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు.

మార్చి 1వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో పెండింగ్ లో ఉన్న చలాన్లను చెల్లిస్తే డిస్కైట్ ఇవ్వనున్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 2 వీలర్ వాహనదారులు పెండింగ్ చలాన్‌లో 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. అంటే మిగతా 75 శాతాన్ని అధికారులు మాఫీ చేయబోతున్నారన్న మాట.

Read Also: “ఫ్రీ లెఫ్ట్”తో ట్రాఫిక్ సమస్యకు చెక్, త్వరలో ఇతర జుంక్షన్ల వద్ద అమలు

ఈ డిస్కౌంట్ వాహనాన్ని బట్టి ఒక్కోలా ఉంది. కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతంగా చెల్లింపునకు అవకాశం ఇచ్చారు. చెల్లింపు విధానాన్ని ఆన్‌లైన్, మీసేవా, ఆన్‌లైన్ గేట్‌వేల ద్వారా చేసుకోవచ్చు.