Penguins: తక్కువ ధర చేపలు తినని పెంగ్విన్స్.. వీడియో వైరల్

దీని ప్రకారం ఒక అక్వేరియమ్‌లో పెంగ్విన్స్, ఓట్టర్స్‌కు తక్కువ ధరలో దొరికే చేపలు పెడుతున్నారు. అయితే, అవి మాత్రం వీటిని తినేందుకు నిరాకరిస్తున్నాయి. హకోనే-ఎన్ అక్వేరియమ్ నిర్వాహకులు ఇంతకుముందు పెంగ్విన్లు, ఓట్టర్స్‌కు జపనీస్ హార్స్ మ్యాకెరెల్ అనే చేపల్ని ఆహారంగా ఇచ్చేవాళ్లు.

Penguins: తక్కువ ధర చేపలు తినని పెంగ్విన్స్.. వీడియో వైరల్

Penguins

Penguins: ప్రపంచంలో అనేక దేశాల్ని ఆర్థిక మాంద్యం సమస్య వెంటాడుతోంది. దీనివల్ల నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం జపాన్‌పై కూడా ఉంది. అక్కడ చేపలతోపాటు ఇతర ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో జూ, అక్వేరియమ్ నిర్వాహకులు ఖర్చు తగ్గించేందుకు మెనూలో మార్పులు చేశారు.

Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’

దీని ప్రకారం ఒక అక్వేరియమ్‌లో పెంగ్విన్స్, ఓట్టర్స్‌కు తక్కువ ధరలో దొరికే చేపలు పెడుతున్నారు. అయితే, అవి మాత్రం వీటిని తినేందుకు నిరాకరిస్తున్నాయి. హకోనే-ఎన్ అక్వేరియమ్ నిర్వాహకులు ఇంతకుముందు పెంగ్విన్లు, ఓట్టర్స్‌కు జపనీస్ హార్స్ మ్యాకెరెల్ అనే చేపల్ని ఆహారంగా ఇచ్చేవాళ్లు. ఇవి చాలా ఖరీదైనవి. ఇటీవలి కాలంలో జపాన్‌లో ఆర్థిక మాంద్యం కారణంగా ఈ చేపల ధరలు భారీగా పెరిగాయి. దీంతో వీటిని కొనలేని నిర్వాహకులు తక్కువ ధరలో దొరికే సాబా అనే మరో రకం చేపల్ని ఆహారంగా అందిస్తున్నారు. అయితే, పెంగ్విన్లు, ఓట్టర్స్ వీటిని తినడం లేదు. గతంలో వీటిని అలవాటు లేకపోవడంతో అవి తినేందుకు నిరాకరిస్తున్నాయి.

Twin Towers: 40 అంతస్తుల బిల్డింగ్స్ కూల్చివేయనున్న అధికారులు.. ఎక్కడంటే

ఈ నేపథ్యంలో ఏం చేయాలో నిర్వాహకులకు తెలియడం లేదు. జపాన్‌లో అనేక జూ నిర్వహకుల పరిస్థితి కూడా ఇంతే ఉంది. దాదాపు 20 శాతం ఖర్చులు తగ్గించే పనులు చేపడుతున్నారు. ఇక పెంగ్విన్స్ చేపల్ని తినేందుకు నిరాకరిస్తున్న దృశ్యాల్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి.