Andhra Pradesh: మోదీ ఏపీకి వ‌స్తున్నారు.. ప్రజలు నిరసనలు తెలపాలి: చ‌ల‌సాని శ్రీ‌నివాస్ people should protest against-modi

Andhra Pradesh: మోదీ ఏపీకి వ‌స్తున్నారు.. ప్రజలు నిరసనలు తెలపాలి: చ‌ల‌సాని శ్రీ‌నివాస్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హక్కులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ మాట్లాడాల‌ని, ఢిల్లీలో ఎన్డీఏ నేత‌ల ముందు మోకరిల్లకుండా గళమెత్తాల‌ని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు.

Andhra Pradesh: మోదీ ఏపీకి వ‌స్తున్నారు.. ప్రజలు నిరసనలు తెలపాలి: చ‌ల‌సాని శ్రీ‌నివాస్

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హక్కులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ మాట్లాడాల‌ని, ఢిల్లీలో ఎన్డీఏ నేత‌ల ముందు మోకరిల్లకుండా గళమెత్తాల‌ని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ వ్యాఖ్య‌లు చేసేవారు ప‌నికిరానివార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్రత్యేక హోదా పోరాటానికి సీఎం జగన్ నేతృత్వం వ‌హించాల‌ని ఆయ‌న అన్నారు. ఎంపీలు అందరినీ కలుపుకుని ఢిల్లీలో ప్ర‌ధాని కార్యాలయం ముందు పోరాడాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

President Election: రాష్ట్రపతి పేరును ప్రకటించనున్న ఎన్డీఏ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ పోరాటం చేయ‌డానికి ముందుకు రావాలని చ‌లసాని అన్నారు. కేసులు పెడ‌తార‌ని భ‌యపడొద్దని, ప్రజలంతా‌ అండగా నిలబడతారని ఆయ‌న చెప్పారు. తాము చేస్తోన్న పోరాటం వల్లే ఏపీకి కేంద్రం నుంచి ఎంతోకొంత ప్ర‌యోజ‌నాలు చేకూరాయ‌ని ఆయ‌న అన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతోందని, తెలంగాణ నేతలు స్పందిస్తున్నారని ఆయ‌న చెప్పారు. రాయలసీమకు నిధులివ్వలేదని, అంతేగాక‌, పోర్టులన్నీ ఆదానికి కట్టబెడుతున్నాని ఆయ‌న విమ‌ర్శించారు.

President Election: రాష్ట్రపతి పేరును ప్రకటించనున్న ఎన్డీఏ

చంద్రబాబు పోరాట స్ఫూర్తి ఏమైందని, ఎన్టీఆర్‌ను ఆయ‌న గుర్తుకు తెచ్చుకోవాల‌ని చ‌ల‌సాని అన్నారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో ప్రత్యేక హోదా ఇస్తున్నారో లేదో చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్రజలు తమదైన రీతిలో నిరసనలు తెలపాలని పిలుపునిస్తున్నామ‌ని అన్నారు. జూలై నెలాఖరు నుంచి ఏపీలో బస్సు యాత్ర చేపడతామ‌ని, త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామ‌ని చెప్పారు. కులాల మధ్య కొంతమంది చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, అటువంటి వారి మాయలో పడ‌వ‌ద్ద‌ని ఆయ‌న అన్నారు.

×