Guava Fruit : గ్యాస్ ట్రబుల్ తో బాధపడేవారు జామపండు తినకూడదా!..

జామ ఆకులు, బెరడును ఇటీవలికాలంలో కషాయంగా కాచుకుని చాలా మంది తాగుతున్నారు. దీనివల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుందని కొందరు ఔషద నిపుణులు సూచిస్తున్నారు.

Guava Fruit : గ్యాస్ ట్రబుల్ తో బాధపడేవారు జామపండు తినకూడదా!..

Guvva

Guava Fruit : సామాన్యుడికి అందుబాటులో ఉండే పండు జామ పండు.. దీనిని ఇష్టపడని వారుండరు. ప్రతిఒక్కరు జామపండును చాలా ఇష్టంగా తింటారు. తినటానికి రుచికరంగా ఉండే జామపండులో అనేక పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఈ పండు ఎంతగానో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. జామకాయతోపాటు, జామ చెట్టు ఆకులు, బెరడు లో సైతం అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి.

జామ ఆకులు, బెరడును ఇటీవలికాలంలో కషాయంగా కాచుకుని చాలా మంది తాగుతున్నారు. దీనివల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుందని కొందరు ఔషద నిపుణులు సూచిస్తున్నారు. ఇక జామకాయ విషయానికి వస్తే అందులో అధిక మొత్తంలో యాంటీ అక్సిడెంట్లు, విటమిన్స్, పోటాషియం లభిస్తాయి. ఫైబర్ సైతం అధిక మొత్తంలో లభ్యమౌతుంది.

జామ కాయను ప్రతిరోజు తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యసమస్యలను దూరంగా పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే గ్యాస్ ట్రబుల్ తో బాధపడే వారు జామ పండును తినకపోవటమే మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే జామ పండులో ఉండే విటమిన్ సి ప్రక్టోస్ లు ఎక్కవగా ఉండటం వల్ల కడులో ఉబ్బరంగా ఉండే భావన కలుగుతుంది. అందుకే గ్యాస్ తో బాధడేవారు ఈ పండును దూరంగా పెట్టటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రధానంగా నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారు రాత్రి సమయంలో దీనిని తీసుకోవటం వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో జామపండు తినటం వల్ల కడుపు ఉబ్బరంతో నిద్ర సరిగా పట్టని పరిస్ధితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు జామకాయను ఎంత మితంగా తింటే అంత మంచిది. 100 గ్రాముల జామలో తొమ్మిది గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. మలబద్దక సమస్యకు చక్కని పరిష్కారంగా ఎంతగానో ఉపయోగపడుతుంది.