Petrol, Diesel Price: అడ్డేలేదు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ కు 80పైసలు పెరుగుదల ..

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడటం లేదు. తగ్గేదే లే అన్నట్లుగా రోజువారిగా ఇంధన ధరలు దూసుకెళ్తున్నాయి. పెట్రోల్ లీటరు రూ. 120 మార్కును అందుకొనేందుకు పోటీ పడుతుండగా ..

Petrol, Diesel Price: అడ్డేలేదు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ కు 80పైసలు పెరుగుదల ..

Petrol, Diesel Price (2)

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడటం లేదు. తగ్గేదే లే అన్నట్లుగా రోజువారిగా ఇంధన ధరలు దూసుకెళ్తున్నాయి. పెట్రోల్ లీటరు రూ. 120 మార్కును అందుకొనేందుకు పోటీ పడుతుండగా, అదేస్థాయిలో డీజిల్ ధర పెరుగుతుంది. ఆదివారం దేశంలోని ప్రధాన చమురు మార్కెట్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు 80పైసలు చొప్పున పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.103.41 కాగా, డీజిల్ రూ.94.67కి చేరింది. మార్చి 22నుంచి నేటి వరకు 13రోజుల్లో 11 సార్లు ఇంధన ధరలు పెరగడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Petrol Price Hike: పెట్రో బాంబ్.. మరోసారి పెరిగిన ధరలు!

తెలుగు రాష్ట్రాల్లోనూ చమురు ధరలు దూసుకెళ్తున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా పెరిగిన ధరల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ లీటర్ రూ. 118కి చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 118.15కు చేరగా, డీజిల్ లీటర్ రూ. 105.50కి చేరింది. విజయనగరంలో పెట్రోల్ రూ. 117.22, డీజిల్ రూ. 104.70గా ఉంది. మరోవైపు విశాఖపట్టణంలో పెట్రోల్ ధర రూ. 117.62కు చేరుకోగా, డీజిల్ ధర సెంచరీ దాటి లీటర్ రూ. 104.06కి చేరింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.13 కాగా డీజిల్ లీటర్ ధర రూ. 103.20కి చేరింది. ఖమ్మం జిల్లాలో పెట్రోల్ ధర రూ. 117.63కు చేరుకోగా, డీజిల్ 103.70కి చేరింది. కరీంనగర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ 117.31 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 103.41కు చేరింది. మెదక్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.13కు చేరుకోగా, డీజిల్ ధర లీటర్ రూ.103.66కు చేరింది.

Petrol, Diesel Prices Today : ఆగని పెట్రో బాదుడు.. గడిచిన 8 రోజుల్లో 7 సార్లు పెరిగిన ఇంధన ధరలు

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు బీజేపీయేతర పార్టీలు ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళన బాటపట్టాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రజలుసైతం రోడ్లపైకొచ్చి ఇంధన ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే గత ఏడాది నవంబర్ 4వ తేదీ నుంచి కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.5 తగ్గించడంతో ఇంధన ధరలు తగ్గుతూ వచ్చాయి. అయితే రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు ఒక్కసారిగా పెరుగుతూ వచ్చాయి. ఇటీవల దేశంలో జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం గమనార్హం.