Pfizer BioNTech : ఫైజర్ బయోఎంటెక్ వ్యాక్సిన్.. పిల్లల్లో ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లను అద్భుతంగా తగ్గిస్తోంది.. కొత్త అధ్యయనం!

Pfizer BioNTech Vaccine : పిల్లలపై ఒమిక్రాన్ వేరియంట్ ఎంతవరకు ముప్పు ఉందో నిర్ధారించేందుకు యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఒక అధ్యయనాన్ని నిర్వహించింది.

Pfizer BioNTech : ఫైజర్ బయోఎంటెక్ వ్యాక్సిన్.. పిల్లల్లో ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లను అద్భుతంగా తగ్గిస్తోంది.. కొత్త అధ్యయనం!

Pfizer Biontech Vax Greatly Reduces Omicron Infection Risk Among Kids Cdc

Pfizer BioNTech Vaccine : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వింత వేరియంట్లతో వణికించింది. డ్రాగన్ చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు పాకి కొత్త వేరియంట్లతో విరుచుకుపడింది. ఆల్ఫా, డెల్టా, బీటా, ఒమిక్రాన్ వంటి అనేక వేరియంట్లు పుట్టుకొచ్చాయి. కరోనా మహమ్మారి బారినపడి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా విజృంభణ సమయంలోనే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. కరోనా వ్యాక్సిన్ల రాకతో చాలావరకు కరోనా మరణాలు తగ్గిపోయాయి. అడపాదడపా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినా, కొత్త కేసులు నమోదవుతున్నా.. కరోనా వ్యాక్సిన్లు దాదాపు కరోనా వ్యాప్తిని నియంత్రణలోకి తీసుకురావడంలో సాయపడ్డాయనే చెప్పాలి. ప్రపంచంలో ఇప్పటికే కరోనా నియంత్రణకు ఫైజర్, కోవాగ్జిన్, కోవిషీల్డ్, ఫైజర్, బయోఎంటెక్, స్పూత్నిక్ వంటి కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటివరకూ కరోనా వ్యాక్సిన్లను రెండు డోసులుగా అందిస్తున్నారు. ఇవి కాక మూడో బూస్టర్ డోసు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటివరకూ 15ఏళ్ల నుంచి ఆపైబడిన వయస్సులో వారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే 12ఏళ్ల నుంచి 17ఏళ్ల వయస్స పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్లు వేసేందుకు అనుమతులు వచ్చాయి. కానీ, ఇప్పటివరకూ ఐదేళ్ల నుంచి 15ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం ఎలాంటి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కరోనావైరస్ ఎక్కువగా పెద్ద వయస్సు వారిపైనే ప్రభావం చూపించడంతో ఆ దిశగా కరోనా వ్యాక్సిన్లను అందుబాటులోకి వచ్చాయి. చిన్నపిల్లలపై కరోనా వ్యాక్సిన్ ప్రభావం తక్కువగా ఉండటంతో టీకాలను రూపొందించలేదు. అయితే, కరోనా వైరస్ రానురాను రూపాంతరం చెందుతూ మరింత ప్రమాదకరంగా మారాయి. ఆ క్రమంలోనే పిల్లలపై కూడా కరోనా కొత్త వేరియంట్ల ప్రభావం అధికంగా మారింది. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా పెరుగుతోంది.

Pfizer Biontech Vax Greatly Reduces Omicron Infection Risk Among Kids Cdc (1)

Pfizer Biontech Vax Greatly Reduces Omicron Infection Risk Among Kids Cdc

Pfizer BioNTech Vaccine .. ఏ వయస్సు పిల్లల్లో ఒమిక్రాన్ ముప్పు తక్కువంటే.. :
ఈ నేపథ్యంలోనే పిల్లలపై ప్రస్తుతం విజృంభిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ ఎంతవరకు ప్రమాదమనేది తెలుసుకునేందుకు యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రకారం.. ఫైజర్-బయోఎన్‌టెక్ (Pfizer-BioNTech vax) కోవిడ్-19 టీకా రెండు మోతాదులు 5 నుంచి 15 ఏళ్ల పిల్లలలో ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని బాగా తగ్గించినట్టు తేలింది. జూలై 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకు 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో వారానికి ఒకసారి SARS-CoV-2 వైరస్ ముప్పుపై అధ్యయనాన్ని CDC కొనసాగించిందని Xinhua వార్తా సంస్థ పేర్కొంది. mRNA కోవిడ్-19 వ్యాక్సిన్‌ అయిన ఈ ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్.. గత ఏడాది మే 12న 12ఏళ్ల వయస్సు నుంచి 15 ఏళ్ల వయస్సు యుక్త వయస్సు పిల్లలకు అందించింది.

అదేవిధంగా, నవంబర్ 2, 2021న 5ఏళ్ల నుంచి 11 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ఇమ్యునైజేషన్ పద్ధతులపై CDC సలహా కమిటీ సిఫార్సు చేసింది. CDC అధ్యయనం ప్రకారం.. టీకాలు వేయని పిల్లల్లో కౌమారదశలో ఉన్నప్పుడు వారిపై ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్‌లలో దాదాపు సగం లక్షణరహితంగానే ఉన్నాయని గుర్తించింది. ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్ -19 టీకా రెండు మోతాదులను అందించగా.. ఐదు నుంచి 11 ఏళ్ల వయస్సు పిల్లల్లో 31 శాతం వరకు ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించగా.. 12ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు గల కౌమారదశ పిల్లల్లో 59 శాతం వరకు ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించాయని అధ్యయనం నిర్ధారించింది.

Read Also : Covid Vaccine: బూస్టర్ డోసుగా భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ పై ట్రయల్స్ షురూ