ఇక గర్భిణులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్

ఇక గర్భిణులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్

COVID-19 vaccine trial in pregnant women: కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న ఫైజర్(pfizer), బయోటెక్(BioNtech) కీలక ప్రకటన చేశాయి. గర్భిణుల కోసం కరోనా వ్యాక్సిన్ చేస్తున్నామని, ఇందులో భాగంగా గర్భిణులపై ట్రయల్స్ చేస్తున్నట్టు తెలిపాయి. ఫైజర్, బయోటెక్ ఉత్పత్తి చేసిన కరోనా టీకాను అమెరికాలో అత్యవసరం కింద వినియోగిస్తున్నారు.

తొలుత చేసిన ట్రయల్స్ లో గర్భిణులు లేరు. ఈమారు నిర్వహించే ట్రయల్స్ లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నట్టు చెప్పారు. ఈ ట్రయల్స్ చాలా కీలకమైనవని, టీకా ఎంతవరకు సురక్షితం, సమర్థవంతమైనది అనేది తెలుస్తుందని చెప్పారు. ఈ ట్రయల్స్ ద్వారా విలువైన సమాచారం లభిస్తుందన్నారు. ట్రయల్స్ లో భాగంగా సుమారు 4వేల మంది గర్భిణులకు టీకా ఇవ్వనున్నారు. 24 నుంచి 34 నెలల గర్భిణులు ట్రయల్స్ లో పాల్గొంటారు. ఆరోగ్యవంతులు, గర్భిణులు 18 ఏళ్ల నుంచి ముసలి వాళ్ల వరకు ఈ స్టడీలో పాల్గొంటారు. అమెరికా, కెనడా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, మొజాంబిక్, సౌతాఫ్రికా, యూకే, స్పెయిన్ లో ట్రయల్స్ నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే కొంతమంది గర్భిణులకు టీకా ఇచ్చారు.

ఈ ట్రయల్స్ లో పాల్గొనే వారికి రెండు డోసుల టీకా ఇస్తారు. 7 నుంచి 10 నెలల పాటు వారిపై పర్యవేక్షణ ఉంటుంది. పుట్టిన పిల్లలపై 6 నెలల వరకు పర్యవేక్షణ ఉంటుంది. వ్యాక్సిన్ వేయించుకున్న తల్లి నుంచి పిల్లల్లో రక్షణాత్మక యాంటీ బాడీస్ వచ్చాయో లేదో తెలుసుకుంటారు.

గర్భిణులకు కరోనా ముప్పు ఎక్కువగా ఉంది. అందుకే వారి కోసం ప్రత్యేకమైన వ్యాక్సిన్ అవసరం ఉందని ఫైజర్ వ్యాక్సిన్ క్లినికల్ రీసెర్ అండ్ డెవలప్ మెంట్ ప్రెసిడెంట్, డాక్టర్ విలియమ్ గ్రబర్ చెప్పారు.