గుండెలు పిండే చిత్రం, సూట్ కేసుపై నిద్రపోతున్న వలస కూలీ పిల్లాడు.. ఆత్మ నిర్బర భారత్ అంటే ఏమిటి?

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ వలస కూలీల జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉపాధి లేదు, ఆదాయం

  • Published By: naveen ,Published On : May 14, 2020 / 12:40 PM IST
గుండెలు పిండే చిత్రం, సూట్ కేసుపై నిద్రపోతున్న వలస కూలీ పిల్లాడు.. ఆత్మ నిర్బర భారత్ అంటే ఏమిటి?

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ వలస కూలీల జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉపాధి లేదు, ఆదాయం

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ వలస కూలీల జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉపాధి లేదు, ఆదాయం లేదు. తినడానికి తిండా కూడా లేదు. దీంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న చోట ఉపాధి లేకపోవడం, తినడానికి తిండి లేకపోవడంతో వలస కూలీలు సొంతూరి బాట పట్టారు. చేతిలో డబ్బు లేకపోయినా, రవాణ సౌకర్యం లేకపోయినా, కాలి నడకనే పయనం అయ్యారు. ఇంటికి చేరాలనే లక్ష్యంతో వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. ఈ క్రమంలో ఇంటికి చేరకుండానే కొందరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. నడిచి నడిచి అలసిపోయి ప్రాణాలు వదిలేస్తున్నారు. లాక్ డౌన్ లో ఇలాంటి దయనీయ దృశ్యాలు ఎన్నో కనిపించాయి. అందరిని కంటతడి పెట్టించాయి. 

దయనీయ దృశ్యం:
తాజాగా హృదయాలను కదిలించే చిత్రం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ దృశ్యం వలస కూలీల కష్టాలకు అద్దం పడుతుంది. కళ్ల వెంట కన్నీరు పెట్టిస్తుంది. వలస కూలీ కుటుంబానికి చెందిన ఓ పిల్లాడు సూట్ కేసుపై తల వాల్చి నిద్రపోయాడు. ఆ పిల్లాడు నిల్చొనే నిద్రపోతున్నాడు. ఆ సూట్ కేసుకి తాడు కట్టిన పిల్లాడి తల్లి దాన్ని లాక్కుంటూ వెళ్తోంది. ఇప్పుడీ ఫొటో వైరల్ గా మారింది. ఈ చిత్రం హృదయాలను పిండేస్తోంది. నడిచి నడిచి అలసిపోయాడో ఏమో, సూట్ కేసు మీద నిద్రపోయాడు. ఎలాగైనా ఇంటికి చేరాలనే ఆత్రుతతో ఆ తల్లి సూట్ కేసుని లాక్కుంటూ పోతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన అందరిని భాదిస్తోంది. అయ్యో పాపం అని విలపిస్తున్నారు. 

ఆత్మ నిర్బర భారత్ అంటే ఏమిటి?
దీనిపై కొందరు నెటిజన్లు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెబుతారని అడుగుతున్నారు. కరోనా దెబ్బకు కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి ప్రధాని మోడీ ఆత్మ నిర్బర భారత్ పేరుతో 20లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసింది. కొందరు నెటిజన్లు దీని గురించి ప్రస్తావిస్తున్నారు. మోడీగారు ఆత్మ నిర్బర భారత్ అంటే ఏంటో చెప్పండి..ప్లీజ్ అని అడుగుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలని, వలస కూలీలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నేరుగా వలస కూలీలకు లబ్ది కలిగేలా చర్యలు ఉండాలన్నారు.