Viral Photo : బైక్‌పై వెళ్తూ ల్యాప్‌ట్యాప్‌లో ఆఫీసు పని చేస్తున్న వ్యక్తి-ఫోటో వైరల్

ఆఫీసులో డ్యూటీ అయిపోయి ఇంటికి బయలు దేరిన తర్వాత మధ్యలో మన బాసు ఫోన్ చేసి ఆఫీసుకు సంబంధించిన పని ఏదైనా చెప్పినప్పుడు ఇంటికి వెళ్లి చేస్తాము. ఎందుకంటే డ్రైవింగ్ లో ఉంటాము కాబట్టి.

Viral Photo : బైక్‌పై వెళ్తూ ల్యాప్‌ట్యాప్‌లో ఆఫీసు పని చేస్తున్న వ్యక్తి-ఫోటో వైరల్

Bengalore Viral Pic

Viral Photo : ఆఫీసులో డ్యూటీ అయిపోయి ఇంటికి బయలు దేరిన తర్వాత మధ్యలో మన బాసు ఫోన్ చేసి ఆఫీసుకు సంబంధించిన పని ఏదైనా చెప్పినప్పుడు ఇంటికి వెళ్లి చేస్తాము. ఎందుకంటే డ్రైవింగ్ లో ఉంటాము కాబట్టి.  కానీ బెంగుళూరుకు చెందిన ఒకవ్యక్తి రాత్రి 11 గంటలు దాటిన సమయంలో, బెంగుళూరులో అత్యంత రద్దీగా ఉండే ఫ్లై ఓవర్ పై బైక్ వెనుకాతల కూర్చుని లాప్ టాప్ లో ఆఫీసు పని చేసుకుంటున్నాడు.

ఈ ఫోటోను హర్ష్ మీత్ సింగ్ అనే వ్యక్తి తన సోషల్ మీడియాలో వారంరోజుల క్రితం పోస్ట్ చేసాడు. దీనిపై నెటిజన్లు భిన్న రీతుల్లో స్పందిస్తున్నారు. కొలీగ్స్ వాళ్ల భద్రత కూడా మర్చిపోయి ఇలా పని చేసేలా భయంకరమైన బాస్ లు ఇప్పటికైనా మారాలి అని ఒకరు స్పందించారు.

ఇది చాలా అర్జెంట్’, ‘ఇది వెంటనే చెయ్యి’ వంటి వాక్యాలను ఇప్పటికైనా జాగ్రత్తగా వాడదాం. ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్లు వీటిని చాలా పొదుపుగా వాడాలి. ఆ మాటలు మీ సహోద్యోగుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మీకు తెలీదు’’ అని మరోకరు పోస్టు చేశారు. ఆ వ్యక్తి ఏదో అత్యవసరమైన పని చేస్తున్నాడని కొందరు అభిప్రాయపడగా మరికొందరు ఆ వ్యక్తి తన వాహానాన్ని ఆపి పని పూర్తి చేసి ఉండవచ్చని
అన్నారు.

ఇంత ప్రమాదకరంగా పని చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదని కొందరు వ్యాఖ్యానించారు. ఇది అతన్ని నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది అని మరోకరు వ్యాఖ్యానించారు. మీరు ఈ ఫోటో తీసే బదులు  బాధ్యాతాయుతమైన  పౌరుడిగా  మారి… అతడిని   ఆపి ప్రయాణంలో ఉండగా ల్యాప్ టాప్ ఎందుకు ఉపయోగిస్తున్నావని అడగవచ్చని మరోకరు సూచించారు.  నేను ప్రమాదానాకి గురైనప్పుడు నా స్వంత అనభవం నాకు ఉంది. మీరు వెనుక కూర్చుని ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి పనులు చేయకండి అని మరోకరు సూచించారు. ఈ పోస్టుకు ఇప్పటి వరకు 41వేల లైక్ లు , 1200 పైగా కామెంట్లు వచ్చాయి.